/rtv/media/media_files/2025/11/20/javelin-missiles-2025-11-20-11-43-00.jpg)
అమెరికా, భారత్ ల మధ్య భారీ డిఫెన్స్ డీల్ ఓకే అయింది. ఈ డీల్‌లో భాగంగా అమెరికా భారత్‌కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్-గైడెడ్ ఆర్టిలరీ రౌండ్ల కొత్త బ్యాచ్‌ను ఇవ్వడానికి యూఎస్ అంగీకరించింది. ఈ డీల్ లో భాగంగా 100 FGM-148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, 216 ఎక్స్‌కాలిబర్ ఆర్టిలరీ రౌండ్లు ఇండియాకు రానున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ కు దేవదూత వచ్చిన జావెలిన్ క్షిపణి వ్యవస్థ కూడా భారత్ కు అందనుంది. రష్యన్ T-72, T-90 ట్యాంకులు వీటి ధాటికి ధ్వంసమయ్యాయి. దీనిని భుజం మీద నుంచే గురి పెడతారు. అందుకే జావెలిన్ క్షిపణి అని పేరు వచ్చింది. ఈ ఆయుధాల డీల్ భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని యూఎస్ తెలిపింది.
జావెలిన్ క్షిపణి..
ఇదొక విధ్వంసకర్ మిస్సైల్. దీనిని భుజంపై నుంచే శత్రు ట్యాంకులకు గురి పెట్టవచ్చును. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంఛ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. ఈ జావెలిన్ మొదట ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్సిపణిని బయటకు కొంత దూరం విసురుతుంది. ఆ తర్వాత అది లక్ష్యం వైపు దూసుకువెళుతుంది. దీనిని కంప్యూటర్ తో నియంత్రిస్తారు. నిజానికి ఈ ఆ యుధం ప్రయోగించిన చోట వేడి, పొగ వెలువడుతాయి. కానీ జావెలిన్ క్షిపణి మోటార్ కొంత దేరం వెళ్ళాకనే పని చేస్తుంది కాబట్టి శత్రువులు దీని జాడను పసిగట్టలేరు. కంప్యూటర్ తో నియంత్రించడం వలన కచ్చితంగా జావెలిన్‌ను ఎక్కడినుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు. ఈ లోపు ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశంలో దాక్కోవచ్చు.రీయాక్టివ్ ఆర్మర్ రక్షణ కవచాలను ఛేదించి.. ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో రెండు దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలిదశలో కవచాన్ని ఛేదించి.. ఆ తర్వాత దశలో వార్‌హెడ్ ట్యాంక్‌ను ధ్వంసం చేస్తుంది. ఈ మిస్సైల్ ను అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హీడ్ మార్టీన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. ఈ క్షిపణి ఒక్కో దాని ధర 2 లక్షల డాలర్ల వరకూ ఉంటుందని అంచనా.
Follow Us