/rtv/media/media_files/2025/04/22/J0OjaeEalL1ktGZT9HJY.jpg)
Shakti Dubey
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫలితాలు కొద్దీసేపటి క్రితమే వెలువడ్దాయి. 1056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 సెప్టెంబర్ జూన్ 16వ తేదీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్ 2025 జనవరి 07 నుంచి 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఆల్ ఇండియాలో శక్తి దూబే, హర్షిత గోయల్ తొలి రెండు ర్యాంకులు సాధించగా.. తెలుగు అభ్యర్థి సాయి శివానికి 11వ ర్యాంకు రాగా బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు వచ్చింది.
Also Read: 9 మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నివాసి అయిన శక్తి దూబే టాపర్ గా నిలిచింది. శక్తి దూబే అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. 2018 నుంచి ఆమె సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి దుబే సివిల్స్ లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషన్ల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు. చాహల్ అకాడమీ షేర్ చేసిన మాక్ ఇంటర్వ్యూ వీడియో, ఇప్పుడు వైరల్ అవుతోంది, దీనిలో శక్తి దూబే తన నేపథ్యం గురించి చెప్పారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరి దేశానికి సేవ చేయాలని ఆమె భావిస్తోంది.
శక్తి దూబే తండ్రి పోలీసు డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నారు. తల్లి గృహిణి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన శక్తి ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. బుధవారం ఇంటికి వస్తదని ఆమె తల్లి ప్రేమ దూబే చెప్పారు. తన కుమార్తె విజయంలో తాను పోషించిన పాత్ర కేవలం అవసరమైన వాటిని అందించడమే మాత్రమేనని ఆమె తండ్రి దేవేంద్ర కుమార్ దూబే అన్నారు. భగవంతుడి ఆశీస్సులు, శక్తి దూబే కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ ఫలితాల పట్ల ఎంతో తాము సంతోషంగా ఉందని చెప్పారు. తాను పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో ఎక్కువగా బయటే ఉంటానని.. తన కుమార్తె విజయంలో తన భార్య పాత్రే ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.
UPSC टॉप करने वाली शक्ति दुबे से मिलिए, उनका Exclusive वीडियो सुनिए
— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) April 22, 2025
चेहरे पर मासूमियत लेकिन इरादे बुलंद
भारतमाता की इस बेटी ने आज UPSC में AIR India Rank 1 हासिल की है
Meet #UPSC2024 Topper Shakti Dubey
Congratulations #ShaktiDubey 🔥#upscresults pic.twitter.com/WcSVwzdnLX
Also Read : కొంపముంచిన ఖలేజా టైటిల్.. అత్యాశకు పోతే రూ .10 లక్షలు బొక్కా
Also Read: జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !
Also Read: గూగుల్ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!
Shakti Dubey | UPSC 2024 toppers | Union Public Service Commission | civil services exam