UP: మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలకతీర్పు! యూపీ మదర్సాలకు భారీ ఊరట లభించింది. వేల సంఖ్యలో ఉన్న యూపీ మదర్సాల విద్యాహక్కు చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. By srinivas 05 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ మదర్సాలకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. వేల సంఖ్యలో ఉన్న యూపీ మదర్సాల విద్యాహక్కు చట్టం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది కూడా చదవండి: అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుసు.. కుల వివక్షపై రాహుల్ గాంధీ! 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం.. ఈ మేరకు మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. అది లౌకికవాద భావనకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఆ అంశం సుప్రీంకోర్టుకు చేరగా.. ఇది రాజ్యంగ విరుద్దమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాదు ఈ తీర్పు 10వేల మదర్సా టీచర్లు, 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని తెలిపింది. ఇక ఈ తీర్పుతో 16వేల మంది మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనుండగా.. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పవన్ రియల్ 'గబ్బర్ సింగ్' అవుతాడా? వారందరి లెక్కలు తేలుస్తాడా?.. నెట్టింట కొత్త చర్చ ఇక దీనిపై అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. మదర్సా చట్టాన్ని సమర్థిస్తూ సంచలన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం యూపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలు, మైనారిటీ హక్కుల పరిరక్షణను పాటించాలని సూచించింది. #up #supreme-court #madrasa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి