అనుభవించే వాళ్లకే ఆ బాధ తెలుసు.. కుల వివక్షపై రాహుల్ గాంధీ!

అనుభవించేవాళ్లకే కుల వివక్ష బాధ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో, సమాజంలో ఈ పిచ్చి చాలా లోతుగా, బలంగా పాతుకుపోయిందన్నారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
fedrer

Rahul Gandhi: దేశంలో, సమాజంలో కుల వివక్ష చాలా లోతుగా, బలంగా పాతుకుపోయిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బోయిన్‌పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదని, సామాన్యులే నిర్ణయించాలని చెప్పారు. మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్‌ మాట్లాడుతూ కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. 


 వివక్ష అనేది ఒక వ్యాధి..

మేము దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం. అందుకే కుల ఘనన అనేది అత్యంత కీలకం. కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు.. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుస్తుంది. ఏదైనా వ్యాధి తెలియాలంటే పరీక్ష చేయాలి కదా.. మేము కుల గణన చేసి ఎవరికి ఏముందో తెలుసుకుంటాం. దీనికి ప్రధాని మోదీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారో తెలియట్లేదు. మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా. మేము దేశవ్యాప్తంగా కుల గణన చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించామని చెప్పారు రాహుల్ గాంధీ.

ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు..


తెలంగాణలో కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. తెలంగాణ కుల ఘనన చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు. ప్రజల నుంచి వారి ఆలోచినలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలి. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారు. వివక్ష తొలగించి అందరికి సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తామన్నారు. 

నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి..
ఇక కుల గణన సంప్రదింపుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇక్కడకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చారు. మాటలు కాదు.. చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని చెప్పారు. 

ఇచ్చిన మాటను నెరవేర్చడమే కర్తవ్యం..
విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చడమే మన కర్తవ్యం. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. ఇందులో ఓసీలు-3076 (9.8%), ఈడబ్ల్యూఎస్- 2774 (8.8%), ఓబీసీలు-17,921(57.11%), ఎస్సీలు-4828 (15.3%), ఎస్టీలు-2783 (8.8%). ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. మనది రైజింగ్ తెలంగాణ. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యం. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు