బిహార్ CM నితీష్ కుమార్‌‌కు బిగ్ షాక్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మిత్రపక్షం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యోదంతం నేపథ్యంలో పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.

New Update
Chirag Paswan criticizes Bihar government

Chirag Paswan criticizes Bihar government

బిహార్ ఎన్నిక కారణంగా NDAలో విభేదాలు మొదలైయ్యాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మిత్రపక్షం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యోదంతం నేపథ్యంలో పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.

శనివారం పాట్నాలో విలేకరులతో మాట్లాడిన చిరాగ్ పాశ్వాన్, బీహార్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. "వరుస హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నేరగాళ్ల ముందు పాలన పూర్తిగా లొంగిపోయింది. రాజధాని నగరంలో, రాజకీయ నాయకుల నివాసాలకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి" అని పాశ్వాన్ అన్నారు.

తాను మద్దతిస్తున్న ప్రభుత్వం ప్రజలను రక్షించలేకపోవడం, నేరాలను నియంత్రించలేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజలు సురక్షితంగా ఉండలేరు" అని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాల బాధను గుర్తించాలని, ప్రభుత్వం పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందా లేదా దాన్ని ఎదుర్కోవడానికి అసమర్థంగా ఉందా అని పాశ్వాన్ ప్రశ్నించారు.

ఈ విమర్శలు బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మిత్రపక్షమైనా కూడా నితీష్ ప్రభుత్వంపై చిరాగ్ పాశ్వాన్ ఇలా బహిరంగంగా దాడి చేయడం, NDA కూటమిలో అంతర్గత విభేదాలకు దారితీస్తుందనే చర్చకు తెరలేపింది. గతంలో 2020 అసెంబ్లీ ఎన్నికలలో కూడా చిరాగ్ పాశ్వాన్ జేడీయూ అభ్యర్థులపై సొంతంగా అభ్యర్థులను నిలబెట్టి నితీష్ కుమార్ పార్టీకి నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు