BIG BREAKING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయనే..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేదానిపై గత కొంతకాలంగా సందిగ్ధత కొనసాగుతోంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

New Update
BREAKING

BREAKING

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేదానిపై గత కొంతకాలంగా సందిగ్ధత కొనసాగుతోంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఈ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారమే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఈయన పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్‌.. ఓబీసీ కమ్యూనిటీకి చెందినవారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి నియామకం పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల బీజేపీ హైకమాండ్‌ దీనిపై అంతగా ఫోకస్ పెట్టలేదు. బీహార్‌లో కూడా ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 20న బీహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్‌ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వచ్చేవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్‌ పేరును ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది.  

Advertisment
తాజా కథనాలు