/rtv/media/media_files/2024/12/30/AMWf27YIrY06mYtDMNew.jpg)
uma Thomas mla
Uma Thomas MLA : కేరళ త్రిక్కాకరకు చెందిన కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యే ఉమా థామస్(MLA Uma Thomas) తీవ్రంగా గాయపడ్డారు. ఉమా థామస్ ఆదివారం సాయంత్రం కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మృదంగ నాదం, భరతనాట్యం కార్యక్రమానికి హాజరయ్యేందుకు రళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ కలిసి వచ్చారు. ఈ క్రమంలో ఉమా థామస్ VIP వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు.. 15 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. తల, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్
తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలు..
రెనై మెడిసిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణన్ ఉన్ని మాట్లాడుతూ.. ఆమె మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో అంతర్గత రక్తస్రావం ఉందని., పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపారు. ఇంకా ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడలేదని మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని చెప్పారు. ఉమా థామస్ తన భర్త, కాంగ్రెస్ నాయకుడు పిటి థామస్ మరణం తర్వాత .. 2022లో ఉప ఎన్నికలో నిర్వహించగా విజయం సాధించి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు.
Also Read: 'పుష్ప2' ర్యాంపేజ్.. ఒక్కరోజులోనే పెరిగిన కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
ഉമ തോമസിന്റെ ആരോഗ്യനിലയിൽ മാറ്റമില്ല, സംഭവത്തിൽ കേസെടുത്ത് പൊലീസ് | Uma Thomas MLA#umathomas #kochi #reporterlive pic.twitter.com/OJOVy5rlAS
— Reporter Live (@reporter_tv) December 30, 2024
Also Read: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?