మహిళా నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎంపీపై కేసు నమోదు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కని షాయినా ఎన్‌సీ అనే మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు దక్కని నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కని ఓ మహిళా నేత.. షిండే వర్గం శివసేనలో చేరడంతో యూబీటీ శివసేన ఎంపీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యనించడం దుమారం రేపుతోంది. Also Read: ఖర్గే వ్యాఖ్యలపై ప్రధాని మోదీ వరుస ట్వీట్లు..బూటకపు హామీలంటూ ఆగ్రహం ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజపీ నుంచి షాయినా ఎన్‌సీ అనే మహిళ నేత టిక్కెట్ ఆశించారు. కానీ ఆమెకు టిక్కెట్ రాకపోవడంతో బీజేపీని వీడి షిండే వర్గం శివసేన పార్టీలోకి చేరారు. అయితే ఆమె చేరికపై శివసేన (UBT) నేత, ఎంపీ అరవింద్ సావంత్ స్పందించారు. '' షాయినా ఎన్‌సీ ఇంతకాలం బీజేపీలోనే కొనసాగారు. ఎన్నికల సమయంలో టిక్కెట్ రాకపోవడంతో ఇప్పుడు మా పార్టీలు చేరారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రజలు అంగీకరించరు. మా వస్తువులు ఒరిజినల్ అని'' అరవింద్ సావంత్ అన్నారు. Also Read: ఇష్టమొచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు మరోవైపు సావంత్ చేసిన వ్యాఖ్యలపై మహిళా నేత షాయినా కూడా స్పందించారు. అరవింద్ సావంత్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. గతంలో నన్ను ఆయన ఎన్నికల ప్రచారానికి తీసుకెళ్లారని.. ఇప్పుడేమో దిగుమతి చేసుకున్న మెటీరియల్ అంటున్నారని అన్నారు. నేను మెటీరియన్‌ను కాదని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇది సావంత్‌తో పాటు ఆయన పార్టీ మైండ్‌సెట్‌ను చూపిస్తోందని అన్నారు. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సావంత్‌పై కేసు నమోదైంది. మరోవైపు బీజేపీ కూడా ఆయన చేసిన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. #telugu-news #national-news #maharashtra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి