CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్

కేంద్రీయ విద్యాలయాల్లో రూల్స్ మారనున్నాయి. కొత్త విద్యావిధానాలను ప్రవేశపెడుతున్నారు. దాని ప్రకారం 2026 నుంచి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రెండు సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించడమే కాకుండా..దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ను రిలీజ్ చేశారు. 

New Update
CBSE: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..

సీబీఎస్ఈ విద్యావిధానంలో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం టెన్త్ ఎగ్జామ్స్ ఇకపై రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ(CBSE) పబ్లిక్‌ నోటీస్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది కేంద్ర విద్యాశాఖ. కొత్త రూల్స్ ప్రకారం ఫిబ్రవరి..మార్చిలో మొదటి విడత పరీక్షలు, మే నెలలో రెండో విడత పరీక్షలు ఉంటాయి. ఇవి రెండూ కూడా పూర్తి సిలబస్ ఆధారంగానే నిర్వహిస్తారు. 

రెండుసార్లు పరీక్షలతో అధిక స్కోర్లు..

అయితే రెండుసార్లు పరీక్షలు ఉన్నా ప్రాక్టికల్స్, ఇతర స్కోర్లు మాత్రం ఒక్కసారే లెక్కిస్తారు. అయితే ఇలా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులు అధిక స్కోర్సు సాధించడానికి ఉపయోగపడుతుందని చెబుతోంది కేంద్రం. ఒకసారి పరీక్షలు బాగా రాయకపోయినా...రెండో సారి రాసిన వాటిల్లో మంచి మార్కులు వస్తే..రెండూ కలిపి టోటల్ చేస్తారు కాబట్టి మొత్తానికి మంచి స్కోర్ వస్తుందని చెబుతోంది. విస్తృతమైన చర్చల తర్వాత రెండు సార్లు పరీక్షలకు సంబంధించిన ముసాయిదాను రూపొందించారు. దీనిని ఇప్పుడు తమ వెబ్‌సైట్‌లో చూడొచ్చని కేంద్రం తెలిపింది.  ఈ ముసాయిదా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మార్చి 9లోగా స్పందించవచ్చని బోర్డు సూచించింది. 

Also Read: USA: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య కోల్డ్ వార్..అసలేం జరుగుతోంది..

వెబ్ సైట్ లో వచ్చిన స్పందనలను లెక్కలోకి తీసుకుని , పరిశీలించిన తర్వాత...ఏమైనా సవరించాల్సి ఉంటే అవి కూడా చేసి అప్పుడు కొత్త విధానాలను అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ డాక్టర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌. 026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు మొదటి విడత, మే 5 నుంచి 20 వరకు రెండో విడత నిర్వహించనున్నారు. దీంతో పాటు ముసాయిదా డేట్‌ షీట్స్‌ను సైతం విడుదల చేశారు.

Also Read: TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు