Sabarimala: అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!

కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు కీలక సూచనలు చేసింది. అయ్యప్ప స్వాములు తీసుకువచ్చే ఇరుముడికట్టులో ఇక నుంచి అగరబత్తులు, పచ్చకర్పూరం, రోజ్‌వాటర్‌ వంటివి తీసుకుని రావొద్దని కోరింది.

sabarimala
New Update

Sabarimala: అయ్యప్ప స్వాములు ఎంతో పవిత్రంగా స్వామి మాల ధారణ చేసి నియామ నిష్ఠలతో దీక్ష చేసి ఇరుముడి కట్టి శబరిమల కొండకు చేరుకుంటుంటారు. ఇరుముడిని తలపై కట్టుకుని.. శబరిమల కొండ ఎక్కిన తర్వాత పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటి పవిత్రమైన ఇరుముడులకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ప్రయాణించే అయ్యప్ప స్వాములు వారి ఇరుముడులను తమతోపాటే విమానంలో తీసుకుని రావొచ్చని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 

Also Read:  కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా?

కొండపైకి తీసుకునిరావద్దని...

ఈ నేపథ్యంలోనే ఇరుముడులకు సంబంధించి తాజాగా శబరిమల అయ్యప్ప ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇరుముడిలో అనవసర వస్తువులను నింపుకుని.. వాటిని కొండపైకి తీసుకునిరావద్దని చెప్పింది. సాధారణంగా ఇరుముడిలో తీసుకువచ్చే కర్పూరం, అగరుబత్తీలు, రోజ్ వాటర్‌ను ఇక నుంచి బరిమలకు తీసుకురావొద్దని ట్రావెన్‌కోర్ బోర్డు ప్రకటించింది. త్వరలోనే ఈ విషయంపై సర్య్కులర్ జారీ చేయనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు.

Also Read:  Canada: విద్యార్థులకు బ్యాడ్ న్యూస్..కెనడా స్టూడెంట్ వీసా స్టాప్..

అంతేకాకుండా కొచ్చి, మలబార్ దేవస్వం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయాల పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. అయితే ఇరుముడిలో తీసుకువచ్చే కర్పూరం, అగరు బత్తీలు పూజా సామగ్రి అయినప్పటికీ.. వాటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప సన్నిదానంలో అగరు బత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదని తెలిపింది. దీంతో ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరుకుల్లో ఎక్కువ భాగం వృథాగా ఉండిపోతున్నాయని గుర్తించింది. 

Also Read: USA: ట్రంప్‌ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు

ఈ క్రమంలోనే వీటిని పండితతవళంలోని దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకే ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.ఇక ఆలయ ప్రధాన పాలకుడు (తంత్రి) రాజీవరు ఇరుముడికట్టులో అగరు బత్తీలు, కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవస్వామ్ బోర్డుకు లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన నేపథ్యంలోనే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో భక్తులు కాలినడకన శబరిమలకు వచ్చినపుడు అన్నం, కొబ్బరికాయలను వారి వెంట తెచ్చుకునేవారని.. కానీ ఇప్పుడు అన్ని చోట్లా ఆహారం దొరుకుతోందని.. అందుకే ఇరుముడికట్టుతో వచ్చేవారు కొంచెం బియ్యం మాత్రమే తెచ్చుకుంటే వాటిని శబరిమలలో సమర్పించవచ్చని లేఖలో పేర్కొన్నారు.

Also Read: AP: ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సస్పెండ్...

వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా నేరుగా శబరిమలకు వచ్చే భక్తుల కోసం పంబ, ఎరుమేలి, సత్రంలో స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే స్పాట్ బుకింగ్ చేసుకునే భక్తులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని తెలిపింది. స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫొటోతో కూడిన ఒక ప్రత్యేక పాస్ ఇవ్వాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా స్పాట్ బుకింగ్ చేసుకున్న యాత్రికుల సమాచారం అంతా తెలుసుకునే విధంగా ఈ పాస్ ఉండబోతుంది.ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe