Canada: విద్యార్థులకు బ్యాడ్ న్యూస్..కెనడా స్టూడెంట్ వీసా స్టాప్..

ఒకవైపు కెనడా, భారత్‌ల మధ్య దౌత్యపరంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరోవైపు విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్ చెప్పింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీంను నిలిపేసింది. 

New Update
visa

Student Direct Stream Visa: 

భారత్‌తో, కెనడా దౌత్యపరమైన ఇబ్బందులను ఎఎదుర్కుంటోంది. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ ట్రుడో సర్కార్ చేసిన ఆరోపణలు...ఇరు దేశాలకు మధ్య శత్రుత్వాన్ని పెంచాయి. తరువాత కూడా కెనడా చేసిన వ్యాఖ్యలు, చేపట్టిన పనులు అనేక గొడవలకు దారితీసింది. దాంతో పాటూ ఇప్పుడు కెనడా భారతీయ విద్యార్థులకు మరో బ్యాడ్ న్యూ చెప్పింది.  ఇన్నాళూ భారత్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆహ్వానిస్తూ వచ్చిన కెనడా తాజాగా షాక్ ఇచ్చింది. ఈ మేరకు కెనడా స్టూడెంట్ వీసా స్కీం ను నిలిపేసింది. అయితే దీనికి కారణ దౌత్యపరమైన సంబంధాలు మాత్రం కాదని చెబుతోంది కెనడా.

ప్రస్తుతం తమ దేశ హౌసింగ్ సంక్షోభంతో కొట్టుమిటాడుతోందని...దాంతో పాటూ వనరుల కొరత కూడా ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఆ దేశంలోని విపరీతంగా వలసలు పెరిగిపోవడమే దీనికి కారణం అనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కారణాల కారణంగానే స్టూడెంట్స్ వీసా ప్రోగ్రాం విషయంలో కెనడా ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

అయితే ఇది ఒక్క భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదు..ఇంకా చాలా దేశాల వారికి కూడా వర్తించనుంది. భారత్ తో పాటు చైనా, కొలంబియా, బ్రెజిల్, మొరాకో, కోస్టారియా, పెరూ, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంతో సహా 14 దేశాలకు చెందిన స్టూడెంట్స్ స్టడీ పర్మిట్ అప్లికేషన్నలు వేగవంతం చేయడానికి ఐ.ఆర్.సీ.సీ కార్యక్రమాన్ని అమలు చేసింది. అయితే... ఈ స్కీం ద్వారా నవంబర్ 8న మధ్యాహ్నం 2 గంటల వరకూ స్వీకరించిన దరఖాస్తులే ప్రాసెస్ చేయబడతాయని తెలిపింది.

Also Read: USA: ట్రంప్‌ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు

Advertisment
Advertisment
తాజా కథనాలు