Holi రష్..  ట్రైన్ టికెట్ దొరకదు.. బస్సు రేటు తగ్గదు.. చుక్కలు చూస్తున్న ప్రయాణికులు!

హోలీకి వెళ్లాలంటే.. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతుంటే, రైళ్లలో అడుగు పెట్టేందుకు కూడా సందు దొరకడం లేదు. సొంతూరికి వెళ్లేందుకు సామాన్యుడు పడుతున్న పాట్లు,

New Update
train

హోలీ(Holi 2026) కి వెళ్లాలంటే.. ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతుంటే, రైళ్లలో(trains) అడుగు పెట్టేందుకు కూడా సందు దొరకడం లేదు. సొంతూరికి వెళ్లేందుకు సామాన్యుడు(passengers) పడుతున్న పాట్లు, రెగ్రెట్ అంటూ ముఖం చాటేస్తున్న రైల్వే బుకింగ్స్, వేల రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సుల దోపిడీ.. వెరసి ఈ ఏడాది హోలీ ప్రయాణం ఒక అగ్నిపరీక్షగా మారింది. 

వచ్చే నెల మార్చి 3న హోలికా దహన్, 4న హోలీ పండుగ ఉండటంతో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల నుండి యూపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్ వెళ్లే వారికి ప్రయాణం ఒక సవాలుగా మారింది. స్తోమత ఉన్న వారు భారీ ధరలు చెల్లించి విమాన టికెట్లు బుక్ చేసుకుంటుంటే, సామాన్యులకు మాత్రం రైల్వేలే దిక్కవుతున్నాయి. కానీ, ప్రస్తుతం అక్కడ కూడా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

Also Read :  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వారికే రాజ్యసభ ఇవ్వాలని ప్రతిపాదన

రైళ్లలో సీట్ల వేట

వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో సీట్ల వేట మొదలైంది. డైనమిక్ ప్రైసింగ్ వల్ల ధరలు విమాన టికెట్లతో పోటీ పడుతున్నా, సీట్లు మాత్రం దొరకడం లేదు. చాలా రూట్లలో ఈ రైళ్లు 'REGRET' స్టేటస్‌ను చూపిస్తున్నాయి, అంటే వెయిటింగ్ లిస్ట్ కూడా నిండిపోయి బుకింగ్స్ క్లోజ్ అయ్యాయని అర్థం. ఢిల్లీ నుండి సిలిగురి వెళ్లే రాజధానిలో 3AC వెయిటింగ్ లిస్ట్ 113 దాటిపోయింది. పాట్నా తేజస్ రాజధానిలో 3AC వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 231కి చేరింది. బెంగళూరు-కోల్‌కతా దురంతోలో 1AC టికెట్ ధర రూ. 7,000 పలుకుతోంది, ఇది దాదాపు విమాన ఛార్జీతో సమానం.

ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి భారతీయ రైల్వే వందలాది ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఒక్క ఉత్తర రైల్వేనే సుమారు 300 ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ముంబై, పుణే నుండి వారణాసి, గోరఖ్‌పూర్ వైపు వెళ్లేందుకు 186 స్పెషల్ ట్రైన్లను కేటాయించారు. అయినప్పటికీ, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ రైళ్లలో కూడా వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంది. చాలా మంది ఇప్పుడు చివరి నిమిషంలో తత్కాల్ టికెట్లపైనే ఆశలు పెట్టుకున్నారు.

రైళ్లలో సీటు దొరకని వేలాది మంది వలస కార్మికులు, ఉద్యోగులకు ఇప్పుడు ప్రైవేట్ బస్సులే దిక్కవుతున్నాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్ వంటి బస్టాండ్‌లలో ఏజెంట్లు ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా తక్కువ ధరలో ఉండే ప్రయాణానికి ఇప్పుడు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు డిమాండ్ చేస్తున్నారు.

మన దేశంలో పండుగ వేళ రవాణా వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిని గమనిస్తే, ఇతర దేశాలతో పోలిక వస్తోంది. ఇటీవల చైనాలో జరిగిన 'స్ప్రింగ్ ఫెస్టివల్' సందర్భంగా సుమారు 12 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు.  మన దేశంలో కూడా హోలీ, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగల సమయంలో ఇలాంటి మౌలిక సదుపాయాల మెరుగుదల అవసరమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

Also Read :  ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Advertisment
తాజా కథనాలు