CPIM: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!

వెస్ట్‌ బెంగాల్ లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్‌ భట్టాచార్య పై ఓ మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని తెలిపారు.

New Update
west

West Bengal : వెస్ట్‌ బెంగాల్ లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్‌ భట్టాచార్య పై ఓ మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని  మహిళా జర్నలిస్టు తెలిపారు. ఈ ఆరోపణల తర్వాత, సీపీఎం పార్టీ నాయకుడు తన్మయ్ భట్టాచార్యను ఆదివారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన ప్రకటించింది. తన్మయ్ భట్టాచార్యపై వచ్చిన ఆరోపణలపై పార్టీ అంతర్గత విచారణ జరుపుతుందని సీపీఎ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం తెలిపారు. 

Also Read:  మరింత విషమించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం!

విచారణ జరిగే వరకు తన్మయ్ భట్టాచార్య సస్పెండ్‌లో ఉంటారు. విచారణ కమిటీ ఇచ్చే ప్రతిపాదన మేరకు చర్యలు తీసుకుంటామని సలీం తెలిపారు. సీపీఎం నాయకుడు తన ఒడిలో కూర్చునే సందర్భం ఎలా వచ్చిందంటే...  ఉదయం తన్మయ్ భట్టాచార్యను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లానని, ఆ సమయంలో ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించి ఒడిలో కూర్చున్నట్లు  ఓ మహిళా జర్నలిస్ట్ ఆదివారం మధ్యాహ్నం ఫేస్‌బుక్ లైవ్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫేస్‌బుక్ లైవ్ మధ్యాహ్నం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సీపీఎంలో కలకలం రేగింది.

Also Read:  జనాభా లెక్కలు... 2028లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన!

అనంతరం మహ్మద్ సలీం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన్మయ్ భట్టాచార్య తీరుపై ఓ మహిళా జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ టచ్ నార్మల్, ఏది బ్యాడ్ టచ్ అని అమ్మాయిలు అర్థం చేసుకోలేని స్థితిలో లేరు. పార్టీగా, సీపీఎం అటువంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. తన్మయ్ భట్టాచార్య ఏదైనా తప్పు చేసి ఉంటే సీపీఎం పార్టీ ఏ విధంగానూ మద్దతు ఇవ్వదని అన్నారు. అతడి వ్యవహార శైలిపై పార్టీలో అంతర్గతంగా దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు.

Also Read: ఏపీలో ఆ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన డిప్యూటీ సీఎం!

 గతంలో ఎమ్మెల్యే...

తన్మయ్ భట్టాచార్య సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తన్మయ్ భట్టాచార్య 2016 నుండి 2021 వరకు నార్త్ డమ్‌డమ్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తరువాత 2021లో చంద్రిమా భట్టాచార్య చేతిలో తన్మయ్ భట్టాచార్య ఓటమిని చవి చూశారు. ఇటీవల బరాహ్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తన్మయ్ ఓడిపోయారు. 

Also Read:  ఆ 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు