/rtv/media/media_files/2024/10/27/NfjYu3JLNOYk3CXs9uRN.jpg)
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఇరాన్‌కు భారీ నష్టం సంభవించింది. అయితే ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే ఖమేనీ అకౌంట్‌ను ఎక్స్ సస్పెండ్ చేసింది.
We must make the Zionists understand the power of Iranian people.
— Khamenei Media (@Khamenei_m) October 27, 2024
Imam Khamenei
Oct. 27, 2024 pic.twitter.com/FkhirlJV1T
ఇది కూడా చూడండి: జగన్, షర్మిల ఆస్తుల వివాదం..మధ్యలో పవన్ ఎంట్రీ? వారి ఛాప్టెర్ క్లోజ్!
వార్నింగ్ ఇవ్వడం వల్ల..
ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఇరాన్‌ను తక్కువ అంచనా వేసి జియోనిస్టు పాలన తప్పు చేసింది. ఇరాన్‌కు ఎలాంటి శక్తి, సామర్థ్యాలు ఉన్నాయో చూపిస్తామని పోస్ట్ చేశారు. దీంతో ఎక్స్ ఖమేనీ ఖాతాను సస్పెండ్ చేసింది. కేవలం వార్నింగ్ ఇవ్వడం వల్ల ఖాతాని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Breaking: ఆగని బాంబు బెదిరింపులు.. విజయవాడలోని ఓ హోటల్‌కు..
గత వారం ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇరాన్ ఘన ఇందన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకి పైగా కేంద్రాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. మళ్లీ ఇదే ఉత్పత్తిని ప్రారంభించాంటే కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ దారుణంగా దెబ్బతీసింది. అలాగే పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో డ్రోన్ల తయారీ యూనిట్‌ని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఇందులో మూడు భవనాలు దెబ్బతిన్నట్లు ఇరాన్ గుర్తించింది.
ఇది కూడా చూడండి: అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా..
ఖెబర్, హజ్ ఖాసీం బాలిస్టిక్ మిసైల్స్‌లో ఘన ఇంధనాన్ని వినియోగిస్తారు. దీన్ని తయారు చేసే కర్మాగారాన్ని కూడా ధ్వంసం చేశారు. అయితే గతంలో ఇరాన్.. ఇదే క్షిపణులను ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు వినియోగించింది. ఈ కర్మాగారం ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌కు వెన్నెముక వంటిదని చెప్పవచ్చు. మొత్తం 20 హెవీ ఫ్యూయల్ మిక్సర్లు ఇజ్రాయెల్ దాడులకు ధ్వంసమయ్యాయి. ఈ ఒక్కో మిక్సర్ ధర దాదాపుగా రూ.2 మిలియన్ డాలర్లు ఉంటాయట.
ఇది కూడా చూడండి: ట్రామీ తుపాను బీభత్సం.. 130కి చేరిన మృతుల సంఖ్య