BIG BREAKING: ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై మిస్సైల్ అటాక్?

ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్‌తో పాకిస్తాన్‌లో భయం మొదలైంది. తాజాగా పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుస కామెంట్స్‌తో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి.

New Update
India pak

ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్‌తో పాకిస్తాన్‌లో భయం మొదలైంది. తాజాగా పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్‌పై ఇండియా ఏ క్షణమైనా మిస్సైల్ అటాక్ చేయొచ్చని నాజర్ ఖాన్ అన్నారు. ఈ సారి జరగబోయే దాడి ఆపరేషన్ సింధూర్‌ కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని సొంత దేశ నాయకులను హెచ్చరించారు. పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్‌గా ఉండాలని నాజర్ ఖాన్ చెప్పుకొచ్చారు.

దీంతోపాటు మరో సంఘటన కూడా ఇండియా, పాక్ వివాదాన్ని మళ్లీ తెరమీదకు  తీసుకువచ్చింది. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా కామెంట్స్‌ చర్చనీయాంశమయ్యాయి. భారత్‌పై పాకిస్తాన్ నేతలు, ఉగ్రవాదులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ ర్యాలీలో సైఫుల్లా భారత్‌ను తొక్కిపడేయాలని అన్నారు. భారత్‌కు గుణపాఠం చెప్పాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు సోమవారం పాక్ రక్షణ మంత్రి భారత్‌ను సమాధి చేస్తామంటూ నోటి దురుసు ప్రదర్శించారు. పాక్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు భారతీయ అధికారులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఉగ్రవాదం ఆపకపోతే పాక్‌ను మ్యాప్‌లో లేకుండా చేస్తామని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. ఇలా వరుస కామెంట్స్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు