Madras Court: తెలుగు వారు వలస వచ్చిన వాళ్లు కాదన్న మద్రాసు హైకోర్టు

తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది.చెన్నపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా వేరుచేసి చూడగలమంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

madras
New Update

Madras:

తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందంటూ మద్రాసు హైకోర్టు పేర్కొంది. చెన్నపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా వేరుచేసి చూడగలమంటూ  న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ నేతృత్వంలోని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది. 

ఇటీవల ఓ సభలో నటి కస్తూరి తెలుగువారినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై పలు తెలుగు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో  చెన్నై, మదురై, సేలం తదితర ప్రాంతాల్లో పోలీసులు కస్తూరిపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

Also Read: US Cabinate: ట్రంప్ క్యాబినెట్‌లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి

ఆమెను అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ కస్తూరి మదురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేయగా దానిపై మంగళవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. కస్తూరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కస్తూరి తన వ్యాఖ్యలపై క్షమాపణ తెలిపారని, అయినా రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చెప్పారు. ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Also Read:  Karnataka: అంబేద్కరే ఇస్లాంలోకి మారాలనుకున్నాడు!

 ప్రముఖ నటి కస్తూరి ఇటీవలే ఓ ప్రసంగంలో తెలుగు మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తమిళనాడులోని పలు తెలుగు సంఘాల నాయకులు ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు సెక్షన్లతో ఆమె పై కేసులు నమోదయ్యాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు నటి కస్తూరికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా ఇల్లు తాళం వేసింది. అలాగే ఆమె ఫోన్ కూడా  స్విచ్ఛాఫ్ చేసుకుంది. దీంతో కస్తూరి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రసంగంలో కస్తూరి మాట్లాడుతూ.. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు  తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని.. అలా వచ్చిన వారు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ కామెంట్‌ చేసింది. 

Also Read: AP Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం

ఇది ఇలా ఉంటే నటి కస్తూరి ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది.    "కొందరి వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడానని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. 'నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని. తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు ప్రేమ, కీర్తిని అందించారు. నా తెలుగు కుటుంబాన్ని అవమానించడం నా ఉద్దేశం కాదు.. అనుకోని సంఘటనకు నన్ను క్షమించండి" అంటూ కస్తూరి చెప్పింది. కస్తూరి బుల్లితెర పై 'గృహలక్ష్మి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.  

Also Read: Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!

#immigration #madras-high-court #telugus #Telugu Heritage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe