US Cabinate: ట్రంప్ క్యాబినెట్‌లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి

ట్రంప్...తన క్యాబినేట్‌ లో రెండు కీలక పదవులకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

New Update
Trump-Musk:  నా కేబినెట్‌ లో మస్క్‌: ట్రంప్‌!

Trump: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌..తన పాలనా యంత్రాంగంలో పదవుల నియామాకం ఇప్పటికే మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. మస్క్ ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’కి నాయకత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో దీనిపై ట్రంప్ పలు  సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!

ఈ విభాగానికి మస్క్‌తో పాటు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హెడ్‌గా ఉండనున్నారని సమాచారం. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. ‘అద్బుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి ‘సేవ్ అమెరికా’ఉద్యమం అవసరానికి అనుగుణంగా ప్రభుత్వ బ్యూరోక్రసీ, అదనపు నిబంధనలు, వృధా ఖర్చులను తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించడానికి నా పరిపాలనకు మార్గం సుగమం చేస్తారు.

Also Read: Karnataka: అంబేద్కరే ఇస్లాంలోకి మారాలనుకున్నాడు!

 ఎలాన్, వివేక్ సమర్థతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు చేస్తారని, అదే సమయంలో అమెరికన్ల జీవితాన్ని మెరుగుపరిచేందుకు నేను ఎదురు చూస్తున్నాను’అని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు.

Also Read:  AP Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం

ట్రంప్ ప్రకారం.. ‘ప్రభుత్వంలోని భారీ వృధా, వ్యయాలు, మోసాలను వారు అరికడతారు’ అని అందులో తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఫ్లోరిడాలోని మార్ ఎలాగో ఎస్టేట్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. 

Also Read: Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!

అతడు ఓ అద్భుతం..

ఈ సందర్భంగా ఎలాన్ మస్క్‌ను ఆకాశానికెత్తేశారు. ఆయన ఓ అద్బుతమని, చాలా తెలివైనవాడని పొగడ్తల్లో ముంచెత్తారు. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో తనతో కలిసి రెండు వారాల పాటు ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్నట్లు తెలిపారు ‘మనకు ఓ కొత్త నక్షత్రం ఉంది.. ఆ నక్షత్రమే ఎలాన్ మస్క్.. అతడు ఓ అద్భుతం.. మేము ఇరువురం ఈ రాత్రి ఇక్కడ కలిసి నిలబడ్డాం.

ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి, ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, విరాళంగా 100 మిలియన్ డాలర్లు అందజేశారు. సోషల్ మీడియాలో ట్రంప్ మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు