Karnataka: అంబేద్కరే ఇస్లాంలోకి మారాలనుకున్నాడు! అంబేద్కర్‌పై కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.అంబేద్కర్ ఇస్లాం మతంలోకి మారాలని అనుకున్నారని కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రీ అన్నారు. By Bhavana 13 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Karnataka: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇస్లాం మతంలోకి మారాలని అనుకున్నారని కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రీ అన్నారు. దీంతో ఈ విషయం కాస్తా మరో వివాదానికి తెర లేపింది. షిగ్గావ్‌లో జరిగిన ర్యాలీలో ఖాద్రీ మాట్లాడుతూ, అంబేద్కర్ బౌద్ధమతం కంటే ఇస్లాంను ఎంచుకుని ఉంటే, కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర వంటి ప్రముఖ దళిత నాయకులు నేడు ముస్లింలుగా ఉండే అవకాశం ఉందని ఖాద్రీ సూచించారు. Also Read: Ap Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం "బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ రోజుల్లో, ఇస్లాంను స్వీకరించడానికి, చేరడానికి ఆనాడు సిద్ధంగా ఉన్నారు. కానీ అతను చివరికి బౌద్ధ మతం స్వీకరించాడు" అని ఖాద్రీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఇస్లాంలోకి మారితే దళిత నాయకులకు వేరే ముస్లిం పేర్లు ఉండేవని ఆయన అన్నారు. ఖాద్రీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు ఖాద్రీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ర్యాలీకి హాజరైన ఎమ్మెల్సీ నాగరాజ్ యాదవ్ ఖాద్రీ వ్యాఖ్యలను అవి పూర్తిగా అబద్దమని చెప్పారు. భారతదేశపు గొప్ప నాయకులలో అంబేద్కర్ ఒకరు. అలాంటి వ్యక్తి మీద ఖాద్రీ ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని అన్నారు. Also Read: Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...! ఖాద్రీ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం అని బీజేపీ పేర్కొంది. ఈ విషయం గురించి బీజేపీ యకుడు సీటీ రవి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను ఇస్లాం స్వీకరించడానికి ఒప్పించేందుకు హైదరాబాద్ నిజాం ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అయితే ఇస్లాం మతంలో సమానత్వం లేదని, అసహనంగా ఉందన్న నమ్మకం కారణంగా అంబేద్కర్ ఆ ప్రతిపాదనలను ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు. Also Read: Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..! కాంగ్రెస్ తనకు టిక్కెట్ నిరాకరించడంతో ఖాద్రీ ఇటీవలే రాబోయే షిగ్గావ్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ రెండూ వివిధ వర్గాల మద్దతు కోసం ర్యాలీ చేస్తున్నాయి. Also Read: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ! అంబేద్కర్ వారసత్వంపై కాంగ్రెస్-బీజేపీ ఉద్రిక్తతలు అంబేద్కర్ వారసత్వంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు రాజ్యాంగపరమైన రక్షణలను బీజేపీ వ్యతిరేకిస్తోందని, అంబేద్కర్ సమానత్వ దార్శనికతకు ఇది చాలా అవసరమని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ సమాజాన్ని కుల, వర్గాల వారీగా విభజిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఈ వర్గాలు ఐక్యంగా ఉంటే కాంగ్రెస్ "విభజన రాజకీయాలు" ప్రభావం కోల్పోతాయని హెచ్చరించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి