మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత .. ఐసీయూలో చికిత్స

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌ (92) అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.   

New Update
Manmohan Singh

Manmohan Singh

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌ (92) అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.  మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి వర్గాలు లేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆయన శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

Also Read: బాలల దినోత్సవం తేదీ మార్పు.. కిషన్‌ రెడ్డి సంచలన కామెంట్స్

ఇదిలాఉండగా.. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు పెరిగింది. అంతేకాదు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 

Also read: సొనియా గాంధీకి అస్వస్థత.. CWC సమావేశానికి దూరం

మరోవైపు సోనియా గాంధీ కూడా గురువారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఒకేరోజున ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలు అస్వస్థకు గురికావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ నాయకులు త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.  

Advertisment
తాజా కథనాలు