TCS Salary Hike: TCSలో 12వేల మంది ఔట్.. జీతాలు భారీగా పెంచిన కంపెనీ..!

టీసీఎస్ తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి 4.5 నుంచి 7 శాతం వరకు జీతాల పెంపును ప్రకటించింది. అయితే, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి మాత్రం 10 శాతానికి పైగా పెంపు ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ వేతన పెంపు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

New Update
TCS Salary Hike

TCS Salary Hike

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్) విపరీతంగా జరిగాయి. ప్రముఖ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇటీవలే భారతీయ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటివి కూడా లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ కంపెనీలు నైపుణ్యాలు సరిగా లేని ఉద్యోగులను అలాగే తక్కువ పనితీరు చూపించే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరికొన్ని కంపెనీలు సీనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను ఎక్కువగా తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. 

Also Read:కవితకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్

TCS Salary Hike

ఇటీవలే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో దాదాపు 2% మందిని.. అంటే సుమారు 12,261 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో కంపెనీ ఒక ప్రకటన చేసింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలు లేకపోవడం ఒక ముఖ్య కారణమని TCS పేర్కొంది. పెరుగుతున్న సాంకేతిక మార్పులు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Also Read:ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు

అయితే ఆ కంపెనీ ఈ తొలగింపులతో పాటు తన ఉద్యోగులలో 80% మందికి వేతనాలను పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. ఈ జీతాల పెంపు జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఒక వైపు ఉద్యోగులను తొలగిస్తూనే మరోవైపు వేతనాలను పెంచడంతో తీవ్రమైన చర్చకు దారితీసింది. తాజాగా ఇదే జీతాల విషయం మరోసారి చర్చనీయాంశమైంది. 

Also Read: నన్నెవరేం పీకలేరు..బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్

టీసీఎస్ కంపెనీ తన ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచిందని ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాదాపు 4.5 శాతం నుంచి 7 శాతం వరకు జీతాలు పెంచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ జీతాల పెంపు ఈ నెల అంటే సెప్టెంబర్ నుంచే వర్తించనుందని సమాచారం. దీనికి సంబంధించి ఇంక్రిమెంట్ లెటర్లను కంపెనీ సోమవారం సాయంత్రం నుంచే తన సిబ్బందికి పంపించిందని తెలుస్తోంది. C3A, దాని సమానమైన గ్రేడ్‌లలో అర్హులైన అసోసియేట్స్‌కు వేతన సవరణ ఉంటుంది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో TCS ఉన్నతాధికారులు ఇటీవల తెలిపారు. 

Also Read: పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

Advertisment
తాజా కథనాలు