Viral Video: ఛీ ఛీ.. లేడీ హెడ్ మాస్టర్ పాడు పని.. పిల్లలతో అవేం పనులు..!

తమిళనాడులో విచిత్ర సంఘటన జరిగింది. ధర్మపురి జిల్లాలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ పిల్లల చేత తన కాళ్లకు మసాజ్ చేయించుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

New Update
tamil nadu school headmaster

tamil nadu school headmaster

విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు స్కూళ్లలో సుఖానికి అలవాటు పడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చిన్న పిల్లలతో చాకిరీలు చేయించుకుంటున్నారు. ఇది మంచి.. ఇది చెడు అని చెప్పాల్సిన గురువులే వారి చేత కాళ్లు పట్టించుకుంటున్నారు. గత కొంత కాలంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పాల్సిన టైంలో విద్యార్థుల చేత మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు ఇప్పటికి చాలానే వైరల్ అయ్యాయి. ఒక టీచర్ కాళ్లకు మసాజ్ చేయించుకుంటే.. మరొక టీచర్ హెడ్ మసాజ్ చేయించుకున్న వీడియో బాగా చక్కర్లు కొట్టాయి. 

tamil nadu school headmaster

తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అభం శుభం తెలియని చిన్న పిల్లలతో తన కాళ్లకు మసాజ్ చేయించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆ లేడీ హెడ్ మాస్టర్ తన కాళ్లకు మసాజ్ చేయమని చెప్పడం చూడవచ్చు. మరి ఇది ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే..

ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా హరూర్ ప్రాంతంలోని మావేరిపట్టి ప్రాథమిక పాఠశాలలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలలో దాదాపు 30 మంది పిల్లలు చదువుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలైన కలైవాణి తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పకుండా.. టేబుల్‌పై పడుకుంది. అదే సమయంలో తన కాళ్ళకు మసాజ్ చేయమని విద్యార్థులను సూచించింది.

దీంతో చుట్టూ ఉంటే విద్యార్థులు ఆ లేడీ హెడ్ మాస్టర్ కాళ్ళకు మసాజ్ చేయడం ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో ఫుల్ జోష్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై పలువురు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చాలామంది ఆ హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని కామెంట్లు పెట్టారు. 

ఈ వీడియో కాస్త ఉన్నత విద్యాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వీడియో గురించి తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలను సందర్శించి ఈ విషయాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె సస్పెన్షన్‌కు గురైంది. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని.. ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యాధికారులు వెల్లడించారు.

ఇటీవల ఇలాంటిదే మరొక ఘటన సేలంలో చోటుచేసుకుంది. ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జె. జయప్రకాష్ అనే గణిత ఉపాధ్యాయుడు పనివేళల్లో విద్యార్థులతో తన పాదాలకు మసాజ్ చేయించుకున్న వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో కారణంగా ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. దర్యాప్తు నివేదిక ఆధారంగా పాఠశాల విద్యా మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. 

Advertisment
తాజా కథనాలు