Kishkindhapuri Trailer: ''ఊరికి ఉత్తరాన.. దారికి దక్షిణాన''.. భయపెడుతున్న కిష్కిందపురి ట్రైలర్!

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదలైంది. ''ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మ  అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

New Update

Kishkindhapuri Trailer: బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదలైంది. ''ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన.. పశ్చిమ దిక్కు ప్రేతాత్మ  అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే.. ఇదొక హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. దెయ్యాల, ప్రేతాత్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ఉన్న కొంతమందిని 'కిష్కిందపురి' అనే ఒక హాంటెడ్  హౌజ్ లో వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత అందులో నిజంగానే ఒక ప్రేతాత్మ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రేతాత్మ హీరోయిన్ అనుపమ శరీరంలోకి ప్రవేస్తుంది. ఆ తర్వాత హీరో ఆ ప్రేతాత్మ నుంచి అనుపమను ఎలా కాపాడతాడు? అసలు  'కిష్కిందపురి' హాంటెడ్ హౌజ్ వెనుక ఉన్న రహస్యమేంటి? అనేది సినిమా.  ట్రైలర్ లో ‘ఆ రాక్షస శక్తిని ఎవరూ ఆపలేరు..’ అనే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. 

Also Read: HBD Pawan Kalyan: ''మనల్ని ఎవడ్రా ఆపేది''.. గీతా ఆర్ట్స్ నుంచి గూస్ బంప్స్ తెప్పిస్తున్న పవర్ స్టార్ మ్యాషప్ వీడియో!

Advertisment
తాజా కథనాలు