కొడుకు ఇంటర్ పరీక్ష రోజున తల్లి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఘటన

ఇంటర్ పరీక్ష రోజునే ఓ విద్యార్థి తల్లి మరణించారు. దీంతో ఆ విద్యార్థి చివరిసారిగా తల్లి పాదాలకు నమస్కరించి.. బాధను దిగమింగుకుని పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Tamil Nadu Class 12 student falls at dead mother's feet for blessings before exam

Tamil Nadu Class 12 student falls at dead mother's feet for blessings before exam

పబ్లిక్ పరీక్షలు అంటే విద్యార్థుల్లో కాస్త టెన్షన్ ఉంటుంది. పరీక్షలు మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు పుస్తకాలకే పరిమితమైపోతారు. పరీక్షలు జరిగేటప్పుడు విద్యార్థి కుటంబ సభ్యుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ బాధ వర్ణించలేనిది. ఒకవేళ తల్లి చనిపోతే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కానీ ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. ఇంటర్ పరీక్ష రోజునే ఓ విద్యార్థి తల్లి మరణించారు. దీంతో ఆ విద్యార్థి చివరిసారిగా తల్లి పాదాలకు నమస్కరించి.. బాధను దిగమింగుకుని పరీక్ష రాసేందుకు వెళ్లాడు.     

Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో మార్చి 3 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తిరునల్వేలిలోని వల్లియూర్‌కు చెందిన సునీల్‌ కుమార్ అనే విద్యార్థి మరికొద్ది గంటల్లో పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. అతని తల్లి గుండె సమస్యతో మరణించింది. ఆరేళ్ల క్రితమే సునీల్‌ తన తండ్రిని కూడా కోల్పోయాడు. దీంతో ఆ తల్లే సునీల్‌ను, అతడి సోదరిని పెంచింది. చివరికి తల్లిని కూడా కోల్పోవడంతో ఆ బాలుడు తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. కానీ బంధువులు, చుట్టుపక్కలవారు పరీక్ష వెళ్లాలని ప్రోత్సహించారు. దీంతో అతడు బాధను దిగమింగుకుని పరీక్ష రాసేందుకు వెళ్లాడు.  

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

చివరిసారిగా తల్లిపాదాల వద్ద హాల్‌టికెట్‌ ఉంచి ఆశీస్సులు తీసుకున్నాడు. ఆ సమయంలో వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడి బంధువులు ఓదార్చి.. పరీక్ష కేంద్రం వద్ద దిగబెట్టారు. బాగా చదవాలని తల్లి కోరుకునేదని గుర్తుచేశారు. ఈ ఘటన తమిళనాడు ప్రభుత్వం దృష్టికి కూడా చేరింది. విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్‌ బృందం సునీల్‌తో మాట్లాడింది. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. తాను కూడా ఒక సోదరుడిలా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం స్టాలిన్‌ సైతం ఈ ఘటనపై ఎక్స్‌లో స్పందించారు.  

Also Read: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు