Iphone Murder: ఎంతకు తెగించార్రా.. ఐఫోన్ కోసం అలా చంపేస్తారా? ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ ను అత్యంత దారుణంగా చంపిన ఘటన యూపీలోని లక్నోలో చోటు చేసుకుంది. ఐఫోన్ ను తీసుకున్న తర్వాత క్యాష్ ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం డెలివరీ బాయ్ ను గొంతి నులిమి చంపి.. ఇందిరా కెనాల్లో పడేసినట్లు పోలీసులు తేల్చారు. By Nikhil 03 Oct 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి ఉత్తరప్రదేశ్, లక్నోలో.. దారుణ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఐఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ ఏజెంట్‌ను అత్యంత ఘోరంగా హత్య చేసి చంపారు. అయితే రెండు రోజులైనా సాహు ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను సంప్రదించారు. సాహు కాల్ డేటా, ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయగా.. అసలు విషయం బయటపడింది. డబ్బులు ఎగ్గొట్టడం కోసం.. చిన్హాట్ ప్రాంతానికి చెందిన గజానన్ అనే వ్యక్తి.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 30 ఏళ్ల భరత్ సాహు అనే డెలివరీ ఏజెంట్ ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. అక్కడ గజానన్.. సాహుని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సాహు డెడ్ బాడీని గోనె సంచిలో కుక్కి సమీపంలోని ఇందిరా కెనాల్లో పడేశారు. ఇదంతా ఫోన్ డబ్బులు ఎగ్గొట్టడానికి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. #iphone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి