సుప్రీంకోర్టులో మరో సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇకనుంచి సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తయారుచేసిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే అందులో ఉన్న లోపాలను సవరించి త్వరలోనే దీన్ని అందుబాటులోకీ తీసుకురానున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రెండేళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ లైవ్‌లో ప్రసారమైంది. యూట్యూబ్‌లో వాటిని ప్రసారం చేస్తున్నారు. తొలి లైవ్ విచారణ సేన VS సేన అనేక కేసుపై జరిగింది.
Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
మహారాష్ట్రలోని శివసేన పార్టీ శిండే వర్గం తిరుగుబాటుతో ఠాక్రే నేతృత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యయి. అసలైన శివసేన తమదేనంటూ శిండే, ఠాక్రే వర్గాల మధ్య పోరు నెలకొంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మొదటిసారిగా లైవ్ విచారణ చేసింది.
Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
వాస్తవానికి 2018లోనే కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలో సాధ్యం కాలేదు. అయితే భారత మాజీ చీఫ్ జస్టీస్ ఎన్‌వీ రమణ పదవీ విరమణ రోజున.. ఆయన నేతృత్వంలో ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలందరూ విక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా సుప్రీంకోర్టు కార్యకలాపాలను అలా లైవ్‌లో ప్రసారం చేయడం అదే మొదటిసారి కావడం విశేషం.
Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?
ఈ పరిణామం తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్‌స్ట్రీమింగ్ చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. దీంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టిరవ్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించారు. అయితే ఇకనుంచి సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు వారికి ఇష్టమొచ్చిన కేసులను ఇలా లైవ్‌లో చూసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్