/rtv/media/media_files/2025/01/31/s4rn9eoxSt6bKfEMQnGd.jpg)
Stocks
stock markets : వాస్తవానికి శని, ఆదివారాలు స్టాక్ మార్కెట్లు మూసి ఉంటాయి. అయితే ఈ ఆదివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ మార్కెట్లు తెరుచుకోబోతున్నాయి. సాధారణంగా శని, ఆదివారాలు స్టాక్‌మార్కెట్లకు సెలవు. అయితే ఈ ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఆ రోజు మార్కెట్ తెరిచి ఉండనుంది. అదివారం అయినప్పటికీ ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి. ఆదివారం దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్‌లు తెరుచుకోబోతున్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు మార్కెట్ కార్యకలాపాలు సాగుతాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా ఆదివారం మార్కెట్ పయనం సాగనుంది. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Follow Us