భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ60 విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్పేస్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర శాటిలైట్లు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం జరిగింది. సోమవారం రాత్రి 9.58 PM గంటలకు బదులుగా 10 గంటల 15 సెకండ్లకు రీషెడ్యూల్ చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీని ప్రకారం సరిగ్గా 10 గంటల 15 సెకెన్లకు నిప్పులు చిమ్ముతూ పీస్ఎల్వీ సీ–60 శ్రీహరికోటలోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. స్పేడెక్స్ ప్రయోగం ద్వారా ఛేజర్, టార్గెట్ శాటిలైట్లను కక్ష్యలో పీఎస్‌ఎల్సీవీసీ-60 ప్రవేశపెట్టనుంది.
Also Read: TML: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు
మళ్ళీ వాయిదా..
ఉపగ్రహాలు అంతరిక్షంలోకి అయితే వెళ్ళాయి కానీ వాటిని డాకింగ్ ఇంకా చేయలేదు. ఈనెల 9 అంటే ఈరోజు చేయాలి. కానీ దానిని వాయిదా వేస్తున్నామని ఇస్రో చెప్పింది. మొదటి ఉపగ్రహాల డాకింగ్ స్పేడెక్స్ ను ఈ నెల ఏడో తారీఖున చేస్తామని చెప్పారు. దానిని తొమ్మిదికి మార్చారు. ఇప్పుడు దీన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు ఇప్పుడు చెప్పారు. దానికి కారణం రెండు ఉపగ్రహాల మధ్య విన్యాసం ఊహించినదాని కంటే ఎక్కువ ఉన్నట్లు తేలడంతోనే వాయిదా వేస్తున్నామని తెలిపారు. ఉపగ్రహాల మధ్య దూరం 225 మీటర్లు ఉండాలి...వాటిని ఆ దూరంలో చేర్చేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. ఉపగ్రహాలు సురక్షితంగానే ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.
Also Read: Tirumala Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. TTD చైర్మన్ సంచలన వీడియో!