UP: యూపీలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ యువకుడు రోడ్డుప్రమాదంలో చనిపోయాడని పోస్ట్‌మార్టమ్ కోసం తీసుకెళుతుండగా ఓ షాకింగ్ ఘటన వైద్య సిబ్బందికి ఎదురైంది. దెబ్బకు డాక్టర్లతో పాటూ పోలీసులు అవాక్కయ్యారు. మీరఠ్ జిల్లా గోట్కాకు చెందిన షగుణ్‌శర్మ అనే యువకుడు తన సోదరుడితో కలిసి బైకుపై ఖతౌలీ వైపు వెళుతున్నాడు.. ఇంతలో మరో వాహనం వీరి బైక్‌నువేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయాలపాలయ్యారు. షగుణ్‌శర్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మీరట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు.
Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!
నేను బతికే ఉన్నా!
డాక్టర్లు ఆస్పత్రిలో షగుణ్‌కు చికిత్స అందించిన తర్వాత.. అతడు చనిపోయినట్లు తెలిపారు. దీంతో షగుణ్ డెడ్‌బాడీని మార్చురీకి తరలించే ఏర్పాట్లు చేశారు. స్ట్రెచరుపై మార్చురీ దగ్గరకు తరలించేందుకు..పంచనామా చేస్తుంటే షగుణ్‌లో కదలిక కనిపించింది. అతడు 'సార్.. నేను బతికే ఉన్నా'అంటూ డాక్టర్‌కు చెప్పాడు. దీంతో అవాక్కైన వైద్యులు షగుణ్‌ను మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారు.
Also Read: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతంతో పాటు!
ఈ వ్యవహారంపై మీరఠ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్సీ గుప్తా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ యువకుడు ఐసీయూలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షగుణ్ సోదరుడు కూడా మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం.
Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
ఈ ఘటనపై వైద్య కళాశాలప్రిన్సిపల్ సీరియస్ అవ్వడంతో పాటు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. ఇక ఈ ఘటనలో డాక్టర్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. కొన ఊపిరితో ఉన్నప్పటికీ పల్స్ కొట్టుకుంటుంది. అలాంటిది పేషెంట్ మాట్లాడే స్థితిలో ఉన్నప్పటికీ డాక్టర్లు చనిపోయాడని మార్చరీకి పంపడం దారుణమైన విషయమంటూ కామెంట్లు పెడుతున్నారు.