Mallu Bhatti Vikramarka:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును నియామించడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు. రోహిత్ వేముల(Rohith Vemula Act) ఆత్మహత్యలో ముఖ్య పాత్ర పోషించిన రాంచందర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఢిల్లీ లో సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులపై ఏఐసీసీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వేముల రోహిత్ అనే దళిత యువకుడిని దేశ ద్రోహిగా చిత్రీకరించిన ఆనాటి ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, నాటి ఎమ్మెల్సీ రాంచందర్ రావులకు కీలక బాధ్యతలు ఇవ్వడం దుర్మార్గమన్నారు.దళితుల పై దాడులు చేసిన వాళ్లకు బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తోందన్న భట్టి ఆరోపించారు.
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూనివర్శిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ కి వచ్చి విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దుతును ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా నాటి విషయాలను వివరిస్తూ రోహిత్ వేముల తాను ఆత్మహత్యకు పాల్పడిన కారణాలను తన సూసైడ్ నోట్‌లో వెల్లడించారని పేర్కొన్నారు. ఆ సమయంలో నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు హెచ్‌సీయూకి వెళ్లి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
Also Read:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దేశంలో బతికే హక్కు ఉందని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలన్నారు. కానీ, రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కామెంట్ చేశారు.ఈ విషయంలో బీజేపీ పునరాలోచన చేయాలన్నారు. రోహిత్ వేముల మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా పదవులు ఇస్తున్న బీజేపీ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని.. న్యాయశాఖ దీనిపై పనిచేస్తోందని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌కు ఢిల్లీ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. దీన్ని బట్టి దళితుల పై దాడులు చేసిన వాళ్లకు బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తోందన్న విషయం స్పష్టమవుతోందని భట్టి ఆరోపించారు. కాగా భట్టి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.
Mallu Bhatti Vikramarka: అలాంటి వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవా? రాంచందర్ రావు నియామకంపై భట్టి హాట్ కామెంట్స్..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును నియామించడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్య కు రాంచందర్ రావు కారణమని ఉప ముఖ్యమంత్రి భట్టి సంచలన ఆరోపణలు చేశారు.
Batti Vikramarka
Mallu Bhatti Vikramarka:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును నియామించడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు. రోహిత్ వేముల(Rohith Vemula Act) ఆత్మహత్యలో ముఖ్య పాత్ర పోషించిన రాంచందర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఢిల్లీ లో సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులపై ఏఐసీసీ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న వేముల రోహిత్ అనే దళిత యువకుడిని దేశ ద్రోహిగా చిత్రీకరించిన ఆనాటి ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, నాటి ఎమ్మెల్సీ రాంచందర్ రావులకు కీలక బాధ్యతలు ఇవ్వడం దుర్మార్గమన్నారు.దళితుల పై దాడులు చేసిన వాళ్లకు బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తోందన్న భట్టి ఆరోపించారు.
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యూనివర్శిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ కి వచ్చి విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దుతును ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా నాటి విషయాలను వివరిస్తూ రోహిత్ వేముల తాను ఆత్మహత్యకు పాల్పడిన కారణాలను తన సూసైడ్ నోట్‌లో వెల్లడించారని పేర్కొన్నారు. ఆ సమయంలో నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు హెచ్‌సీయూకి వెళ్లి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
Also Read:Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దేశంలో బతికే హక్కు ఉందని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలన్నారు. కానీ, రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కామెంట్ చేశారు.ఈ విషయంలో బీజేపీ పునరాలోచన చేయాలన్నారు. రోహిత్ వేముల మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా పదవులు ఇస్తున్న బీజేపీ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్
రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతోందన్నారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని.. న్యాయశాఖ దీనిపై పనిచేస్తోందని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌కు ఢిల్లీ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. దీన్ని బట్టి దళితుల పై దాడులు చేసిన వాళ్లకు బీజేపీ ఉన్నత పదవులు, ప్రమోషన్లు ఇస్తోందన్న విషయం స్పష్టమవుతోందని భట్టి ఆరోపించారు. కాగా భట్టి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.
Also Read:Blood Pressure: రక్తపోటు పెరగడానికి ఈ అలవాట్లే కారణమా..?ఈ రోజే దానిని తరిమి వేయండి..!!