Telangana: ఇకనుంచి ఓపీ కోసం వేచిచూడాల్సిన పని లేదు.. క్యూఆర్ కోడ్‌తో స్కాన్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తప్పింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే రోగులు ఓపీ చీటి అందుకునే సౌకర్యం లభించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.