మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్

దళిత మైనర్ బాలిక అత్యాచార కేసులో సంచలన వెలుగు చూశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో 5సార్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని విచారణలో తేలింది. 30 FIRలు ఫైల్ చేసి.. 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు.

author-image
By K Mohan
New Update
kerala rape case

kerala rape case Photograph: (kerala rape case)

అత్యాచార కేసు విచరణలో పోలీసుకు సంచలన విషయాలు తెలిశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రస్తుతం బాదితురాలికి 18 ఏళ్లు ఆమె 13 ఏళ్ల వయసు నుంచి 62 మంది తనను లైంగికంగా వేధించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పతనంతిట్ట జనరల్ హాస్పిటల్‌లో 2024 జనవరిలో యువతిని కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

అథ్లెట్ అయిన దళిత బాలికపైన మొత్తం ఐదు సార్లు బాలిక సామూహిక అత్యాచారానికి గురైనట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఆమె కోచ్‌లు, సహ క్రీడాకారులు, క్లాస్‌మేట్స్‌ ఉన్నారన్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఆమె తన తండ్రి ఫోన్‌ను ఉపయోగించేవారు. ఆ ఫోన్‌ను, ఆమె రాసిన డైరీలను పరిశీలించి సుమారు 40 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో సెట్ పోలీసులు ఇప్పటివరకు 44 మందిని అరెస్టు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, కేసుల్లో పేర్కొన్న 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు.

నిందితుల్లో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారి కోసం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసేందుకు కేరళ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని చూస్తున్నారు. వీరితో పాటు మరో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. గతేడాది 12వ తరగతి చదువుతున్న బాలికను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పరిచయమైన ఓ యువకుడు కేరళ రన్నీలోని రబ్బరు తోటకు తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు