ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయడంతో పాటు వివిధ డిమాండ్లు పరిష్కరించాలని రైతులు చేసిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యమం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రైతులు ఓ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో చేతావనీ (హెచ్చరిక) ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది.
Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి
కేంద్రం రైతులను మోసం చేసింది
ఒకవేళ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే వచ్చే ఏడాది మరో ఉద్యమం తప్పదని ఈ ర్యాలీలను ఓ హెచ్చరికగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయకుండా మోసం చేసిందని ఏఐకేఎస్ నేత హన్నన్ మొల్లా పేర్కొన్నారు. మరోవైపు రైతుల డిమాండ్లను పరిష్కరించడంలో ఆలస్యం చేస్తే.. వచ్చే ఏడాది భారీ ఉద్యమాన్ని చేపడతామని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 60 శాతం ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని అందులో ఎక్కువమంది రైతులే ఉన్నారని తెలిపారు.
Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు
ప్రతి జిల్లాలో 100 గ్రామలను కవర్ చేస్తాం
కార్మిక, వ్యవసాయం కార్మిక సంఘాలతో పాటుగా ఎస్‌కేఎం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో నవంబర్ 7 నుంచి 25 వరకు 50 వేల గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. మొత్తంగా ప్రతి జిల్లాలో 100 గ్రామాలను కవర్ చేసేలా వాహన జీతాలు, పాదయాత్రలు నిర్వహిస్తామని పేర్కొంది. తాము కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లను ఇంటింటికి వెళ్లి వివరిస్తామని కూడా రైతు నేతలు చెప్పారు.
Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!
Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!