Supreme Court : న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!

దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై కోర్టులో న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ న్యాయదేవత కళ్ళకు గంతలు లేకుండా కొత్త విగహాన్ని ఏర్పాటు చేయించారు.

New Update
lady justice statue

A new statue of 'Lady of justice'

Supreme Court :సుప్రీం కోర్టులో న్యాయదేవత విగ్రహం కళ్ళకు గంతలు లేకుండా కనిపించడం వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లు భారత దేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్ళకు గంతలు ఉండేవి. కానీ ఇక పై న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగించాలని  సుప్రీం కోర్టు నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రధాన న్యాయమూర్తి  డీవై చంద్రచూడ్ న్యాయదేవత కళ్ళకు గంతలు లేకుండా కొన్ని మార్పులతో కొత్త విగహాన్ని ఏర్పాటు చేయించారు. 

Also Read:  ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

సుప్రీం కోర్టులో కొత్త విగ్రహం

ఇన్నాళ్లు కోర్టులో న్యాయదేవత విగ్రహం గమనిస్తే..  కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహంలో డమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం బుక్ ఉంచారు. అలాగే న్యాయదేవత కళ్ళకు గంతలు తొలగించారు. న్యాయం గుడ్డిది కాదని, చట్టానికి కళ్లున్నాయని, చట్టం ముందు అందరూ సమానులేనని తెలియజేసే బలమైన సంకేతంతో న్యాయదేవత విగ్రహంలో సుప్రీం కోర్టు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు న్యాయస్థానంలోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. 

Also Read:  PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు