Kerala: అయ్యప్ప దర్శనం..రోజుకి 80 వేల మందికి మాత్రమే!

ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు సీఎంఓ ప్రకటించింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

sabarimala
New Update

Sabarimala: కేరళ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్‌ ప్రారంభం కానుంది. దీంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. 

Also Read: నేను ఈదుతా..మీరు లొట్టలేసుకుంటూ తినండి

వర్చువల్‌ క్యూ బుకింగ్‌ సమయంలో ...యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు ఓ ప్రకటనలో ప్రకటించింది. తీర్థయాత్రల సన్నాహాలను సమీక్షించేందుకు సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

Also Read: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్‌!

మకరవిళక్కు సీజన్‌ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గానే జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. పార్కింగ్‌ సమస్యలను పరిష్కరించడం పై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ  పార్కింగ్‌ నిర్వహణ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు.

Also Read: రెడ్ లైట్‌ ఏరియాలో దుర్గామాత విగ్రహాం..ఎందుకు?

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహా నిర్మాణం పూర్తయ్యిందని..త్వరలో మరొకటి పూర్తి కానున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Also Read:  ఖైదీలకు దసరా ఆఫర్‌..మటన్‌ బిర్యానీ, చికెన్ కర్రీ!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe