Delhi: నేను ఈదుతా..మీరు లొట్టలేసుకుంటూ తినండి

ఢిల్లీలోని ఓ ఫేమస్‌ స్వీట్‌ ఫాపులో రసగుల్లా జ్యూస్‌ లో ఎలుక పరిగెడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

New Update
rat

కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయనే సామెతను మనం ఏదోక సందర్భంలో ఉపయోగించే ఉంటాం. కానీ రసగుల్లా జ్యూస్‌ లో ఎలుకలు పరిగెత్తడం ఎప్పుడైనా చూశారా. అయితే ఇక్కడ చూసేయండి మరి. ఢిల్లీలోని ఓ ఫేమస్‌ స్వీట్‌ షాపు కస్టమర్లతో కళకళాలాడుతోంది. ఓ పక్క స్వీట్స్‌  కొనుగోలుతో కస్టమర్లు బిజీగా ఉంటే..మరో పక్క డిస్ ప్లే కేసులో ఉంచిన స్వీట్లను రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి ఎలుకలు.

Also Read: మావోయిస్టులు వర్సెస్ పోలీసులు..! ఎర్రదండు కదులుతుందా..?

ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో , షాపు సంబంధించిన వివరాలు లేవు. కానీ రసగుల్లలో స్విమ్మింగ్‌ చేస్తున్న ఎలుకల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాపు నిర్వాహకులను ఓ రేంజ్‌ లో తిట్టుకుంటున్నారు.  చాలా మంది కస్టమర్లు తమకు ఇష్టమైన, కావాల్సిన స్వీట్స్ కొనుగోలు చేసేందుకు క్యూలో నిలబడ్డారు. ఇంతలో ఓ కస్టమర్​ స్వీట్స్​ డిస్​ప్లే కేసులో స్వీట్స్ లో ఎలుక స్విమ్మింగ్​ దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు.

Also Read: పక్కా వ్యూహంతోనే ఎన్‌ కౌంటర్

అమ్మకానికి ఉంచిన స్వీట్లను ఎలుక కొరుకుతూ.. వాటిపైనే జంపింగ్​, రన్నింగ్​.. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని పనులు అక్కడే కానిస్తోంది కూడా.  ఈ దృశ్యాలు చూసిన కస్టమర్లకు దిమ్మతిరిగింది. దీంతో షాపు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: డిఫరెంట్ షేడ్స్ లో అదరగొట్టిన మెగా ప్రిన్స్.. 'మట్కా' టీజర్ చూశారా?

ఈ ఎలుక సాహసాన్ని, షాపు నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్షన్ ఇచ్చారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇది తప్పనిసరిగా పెంపుడు ఎలుక అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు