West Bengal: ఖైదీలకు దసరా ఆఫర్‌..మటన్‌ బిర్యానీ, చికెన్ కర్రీ!

దుర్గాపూజల సమయంలో బెంగాల్‌ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జైలులో ఉండే ఖైదీలకు ప్రత్యేకమైన వంటకాలు అందించనుంది. ఈసారి ఖైదీల కోరిక మేరకు చికెన్, మటన్, ఫిష్ సహా అనేక రకాల వంటకాలను వారికి వడ్డించనున్నట్లు వెల్లడించారు.

New Update
prisoners

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ నవరాత్రుల సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా జైలులో ఉంటున్న వారికి నవరాత్రుల సందర్భంగా పసందైన వంటకాలతో భోజనం అందించనున్నట్లు బెంగాల్‌ ప్రభుత్వం తెలిపింది. 

Also Read: రెడ్ లైట్‌ ఏరియాలో దుర్గామాత విగ్రహాం..ఎందుకు?

ఇందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు సహా అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను లంచ్, డిన్నర్ మెనూలో చేర్చనున్నట్లు తెలిపింది. ఖైదీల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఈ దసరా పండగ సందర్భంగా దుర్గా పూజలు జరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

Also Read:  "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్‌!

 ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లల్లో ఉండే ఖైదీలకు లంచ్, డిన్నర్ సమయంలో రకరకాల వంటకాలను వడ్డించనున్నట్లు వివరించింది. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్, మాచెర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర), మాచెర్ మాతా దియే దాల్ (చేప తలతో పప్పు) వంటి వంటకాల రుచిని ఖైదీలకు చూపించనున్నారు.

Also Read: నేను ఈదుతా..మీరు లొట్టలేసుకుంటూ తినండి

పండగ సంతోషాన్ని కోల్పోతున్నామనే బాధ లేకుండా చేసేందుకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆహార పదార్థాలన్నీ జైలులో ఉండే ఖైదీల చేతనే తయారు చేయించనున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. ఈ వంటకాలను ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలకు కూడా అందించనున్నట్లు జైలు అధికారులు చెప్పారు. 

Also Read: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Advertisment
తాజా కథనాలు