Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌కు రోనిత్ రాయ్ సెక్యూరిటీ..

దాడి, కీలక ఆపరేషన్ల తర్వాత నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి తిరిగి వచ్చారు. ఈరోజ మధ్యాహ్న ఆయన డిశార్జ్ అయ్యారు. ప్రస్తుతం పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంది. బాలీవుడ్ నటుడు రోనిత్రాయ్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. 

New Update
bolly wood

Ronith Roy, Saif Ali khan

బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈరోజు ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ముంబైలోని తన ఇంటికి చేరుకున్నారు. ఐదురోజులపాటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అయితే సైఫ్ పూర్తిగా కోలుకొనేందుకు కొంత సమయం పడుతోందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. మెడ మీద, వీపుపై బ్యాడేజ్‌లో సైఫ్ అలీ ఖాన్ బాంద్రాలోని ఇంటికి చేరుకున్నాడు.

టైట్ సెక్యూరిటీ..

సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన తర్వాత ఆయన కుటుంబం అప్రమత్తమైంది. మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా..సైఫ్ అలీ ఖాన్ ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలను మరో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్‌కు  అపగించారు. రోనిత్ ముంబయ్‌లో ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. తాము ప్రస్తుతం సైఫ్‌తో ఉన్నామని...ఆయనకు ఫుట్ టైట్ సెక్యూరిటీ అందిస్తున్నామని రోనిత్ రాయ్ తెలిపారు. సైఫ్ ఆరోగ్యం బాగుపడిందని..ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. యితే సైఫ్‌కు ఏ కేటగిరీ సెక్యూరిటీని పెట్టామన్నది మాత్రం రోనిత్ రాయ్ చెప్పలేదు. 

ఇది కూడా చదవండి: RRB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. RRBనుంచి 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు