/rtv/media/media_files/2025/04/15/mYfJQcosMgKQBQUdOi7x.jpg)
Priyanka gandhi and Robert Vadra
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానాలోని భూ ఒప్పందం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రెండోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇక ఈ కేసులో అధికారులు ఏప్రిల్ 8న మొదటి సమన్లు జారీ చేశారు. కానీ ఆయన స్పందించలేదు. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు.
Also Read: అమెరికా, చైనా టారిఫ్ వార్‌లో బిగ్‌ట్విస్ట్.. ఒప్పందానికి రానున్న ఇరుదేశాలు !
హర్యానాలోని భూ ఒప్పందాలలో రాబర్డ్ వాద్రకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. విచారణ కోసం తమ ముందు హాజరుకావాలని ఈడీ అధికారులు రాబర్ట్ వాద్రాను కోరారు.
Also Read: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!
ఈడీ చెప్పిన వివరాల ప్రకారం.. రాబర్ట్ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో ఉన్న 3.5 ఎకరాల స్థలాన్ని కొన్నది. అనంతరం వాద్రా కంపెనీ ఆ భూమిని రూ.58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి అమ్మేసింది. అయితే ఈ ఆదాయం మనీ లాండరింగ్ పథకంలో భాగమనే అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.
telugu-news | rtv-news | robert-vadra | congress