ఏడాదికి లక్షా 50 వేల రోడ్డు ప్రమాదాలు.. 2లక్షల 50 వేల మరణాలు.. గంటకు సగటున 17మంది మృత్యువు ఒడిలోకి జారుతున్న ఘోర పరిస్థితులు. ఇండియాలో ఏ నిమిషం ఎటు వైపు నుంచి మరణం సంభవిస్తుందో తెలియదు. రోడ్డుపై వెళ్లాలంటే భయం పుట్టక మానదు. బస్సు ఎక్కినా, సైకిల్‌పై వెళ్లినా బతుకుకు గ్యారెంటీ లేని రోజులివి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వరుస పెట్టి ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇండియాలో ఘోర ప్రమాద ఘటనలు అంతకంతకూ పెరుగుతండడం కలవరపెడుతోంది. విశాఖ కంచరపాలెం జాతీయ రహదారిపై సెప్టెంబర్ 24న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ వెళ్తున్న ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
ఇక సెప్టెంబర్ 23న అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మరణించారు. ఇకే అదే రోజు మహారాష్ట్రలోని అమరావతిలో ధరణి రహదారిపై ప్రైవేట్ బస్సు అదుపుతప్పి 30 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబర్ 22న తిరుపతి జిల్లా చిల్లకూరు హైవేపై ఆగి ఉన్న కంటెయినర్ లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. అదే రోజు అనంతపురం జిల్లా రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీకొనడంతో నలుగురు స్పాట్‌లోనే మరణించారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకులకు వెళ్లి తిరిగి ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇటు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ కార్యకర్త వరికుప్పల మహేశ్ చనిపోయాడు.
Also Read: 11 రూ. లకే ఐఫోన్ 13 కేవలం ముగ్గురికే ..ఫ్లిప్ కార్ట్ ఏం చెప్పింది?
దేశంలో 70శాతం రోడ్డు ప్రమాద మరణాలకు అతివేగమే కారణం. ప్రతి 10 మందిలో ఏడుగురు అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా తమిళనాడు, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువ జరుగుతున్నాయి. బాధితుల్లో సగానికి పైగా మంది పాదచారులు, బైక్‌పై వెళ్లేవారే ఉన్నారు. దాదాపు 84శాతం మంది 18-60 సంవత్సరాల మధ్య పని చేసే వారున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడం, మద్యం తాగి బండి నడపడం లాంటి వాటి వల్ల ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయి. ఇక రాంగ్ సైడ్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు రెండో అతి పెద్ద కారణం. అటు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సీట్‌బెల్ట్‌లను ఉపయోగించకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం కారణంగా ప్రమాదానికి గురవగానే చనిపోతున్నారు. సెఫ్టీ పాటించిన వారు గాయాలతో ప్రాణాలు దక్కించుకుంటున్నారు.
కారు ప్రమాదాలలో మరణించిన వాహన ప్రయాణీకులలో దాదాపు 50శాతం మంది సీటు బెల్ట్ ధరించడంలేదని నివేదికలు చెబుతున్నాయి. ట్రాఫిక్ చట్టాలపై అవగాహన లేకపోవడం ప్రమాదాల సంఖ్యను పెంచుతోంది. భారత్‌లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు . సగటున ప్రతిరోజూ 1,264 రోడ్డు ప్రమాదాలు, 462 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని వాహనాల్లో కేవలం 1శాతం మాత్రమే భారత్‌లో ఉన్నాయి. అయితే దాదాపు 10శాతం రోడ్డు ప్రమాద మరణాలు నమోదవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి దాని GDPలో 5-7శాతం నష్టం వాటిల్లుతుందని అంచనా.
Also Read: ఢిల్లీలో త్వరలో కృతిమ వర్షాలు.. ఎందుకో తెలుసా ?