ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార ఘటన.. మృతిరాలి తల్లిదండ్రులు పిటిషన్ కొట్టివేత

ఆర్జీకర్‌ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మరోసారి విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Supreme Court

Supreme Court

ఆర్జీకర్‌ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మరోసారి విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. కోల్‌కతా హైకోర్టులో ఈ పిటిషన్‌ను కొనసాగించవచ్చని చీఫ్‌ జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచనలు చేశారు. 

Also Read: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..బీఆర్ఎస్వీ కార్యకర్తల అరెస్ట్

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2024, ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్.. ఆర్‌జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉంది. బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలచివేసింది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు అతడికి ఉరిశిక్ష వేయాలంటూ పలువురు డిమాండ్లు చేశారు. కానీ కోర్టు ఇది అసాధారణ కేసు కాదని పేర్కొంటూ ట్రయల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. 

Also Read: స్వాతి హత్య కేసు మరో కీలక మలుపు.. లవ్‌ జిహాద్ అని ఆరోపిస్తున్న హిందూ సంఘాలు

అయితే సంజయ్‌రాయ్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడంపై ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం చేసిన ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదే తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది. మరోవైపు కేసును మళ్లీ విచారణ చేయాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.  

Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్‌..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు