రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ

ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇందుకోసం పార్లమెంటులో బిల్లులు ఆమోదించేందుకు ఇండియా కూటమి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

New Update
Rahul gandhi

Rahul Gandhi: రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని తెలిపారు. ఇందుకోసం పార్లమెంటులో బిల్లులు ఆమోదించేందుకు ఇండియా కూటమి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలను భయపెట్టి, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నాశనం చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఛత్రపతి శివాజీకి క్షమాపణలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రధాని మోదీపై రాహుల్ మండిపడ్డారు. 

Also Read: హర్యానాలో బీజేపీకి ఝలక్..కాంగ్రెస్ వైపు మొగ్గు

ఇటీవల మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లోని ఛత్రపతి భారీ విగ్రహం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ప్రధాని క్షమాపణలు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు. శనివారం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో పర్యటన చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి..ఆ తర్వాత 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్‌'లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో కులాల ప్రాతిపదికన జనాభా లెక్కలను సేకరించడం కోసం ఇండియా కూటమి అవసరమైన చట్టాలు తీసుకొస్తుందని రాహుల్ అన్నారు. కులగణన ద్వారా ప్రతి కులంలో ఎంతమంది ఉన్నారు, అలాగే భారత ఆర్థిక వ్యవస్థపై వారికి ఎంతవరకు నియంత్రణ ఉందనేది తెలుసుకోవాలని తెలిపారు.

 దేశ జనాభాలో 90 శాతం మందికి అవకాశాలు ఇచ్చే తలుపులు మూసేశారని అన్నారు. కేవలం 90 మంది అగ్రశ్రేణి ఐఏఎస్‌ అధికారులు భారత బడ్జె్ట్‌ను నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. అందులో ఓబీసీలు ముగ్గురు, ఎస్టీలు ముగ్గురు, ఆదివాసీ అధికారి ఒక్కరే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ జనాభాలో ఓబీసీలు కనీసం 50 శాతం మంది, దళితులు 15 శాతం, ఆదివాసీలు 8 శాతం ఉన్నారని తెలిపారు. దేశంలో కులగణన చేయడం అనేది లోపాలను గుర్తించే ఎక్స్‌రే లాంటిదేనని వ్యాఖ్యానించారు. 

Advertisment
తాజా కథనాలు