Yediyurappa: పోక్సో కేసులో యడియురప్పకు ఊరట.. కోర్టు కీలక ఆదేశం

పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ఊరట లభించింది. మార్చి 15న దీనిపై విచారణకు హాజరుకావాలని ఫాస్ట్‌ ట్రాక్‌ ఆదేశించింది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది.

New Update
Relief for Yediyurappa as Karnataka High Court pauses summons in Pocso case

Relief for Yediyurappa as Karnataka High Court pauses summons in Pocso case

ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు హైకోర్టును ఆశ్రయించారు. అయితే మార్చి 15న పోక్సో కేసు విచారణకు హాజరుకావాలని ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఇటీవల యడియూరప్పను ఆదేశించింది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది. దీంతో యడియూరప్పకు ఈ కేసులో కాస్త ఊరట లభించినట్లయ్యింది.  

Also Read: ట్రైన్ హైజాక్‌లో భారత్‌ హస్తముందున్న పాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా

ఇక వివరాల్లోకి వెళ్తే.. మానసికంగా ఆరోగ్య సమస్యలు ఉన్న ఓ 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు గతంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ మహిళ తన 17 ఏళ్లు కూతురుతో కలిసి గతేడాది ఫిబ్రవరి 2న బెంగళూరులోని యుడియూరప్ప ఇంటికి వెళ్లింది. ఓ మోసం కేసులో తమకు సాయం చేయాలంటూ వేడుకుంది. అయితే ఆ సమయంలోనే తన కూతురును బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి చెప్పింది. 

Also Read: తస్సాదియ్యా.. కోతి చేష్టలు అంటే ఇవే మరి.. చూడండి ఏం చేసిందో!

దీంతో గతేడాది మార్చి 14న ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు బాలకపై లైంగిక వేధింపుల ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండిచారు. తనపై కేసు పెట్టిన మహిళ.. గతంలో కూడా పలువురిపై ఇలాంటి ఆరోపణలే చేసినట్లు చెప్పారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఫాస్ట్‌ ట్రాక్ కోర్టుకు కూడా ఈ వ్యవహారం వెళ్లింది. మార్చి 15న విచారణకు రావాలని యడియురప్పను ఈ కోర్టు ఆదేశించగా.. తాజాగా కర్ణాటక హైకోర్టు ఈ సమన్లను నిలిపివేసింది.  

Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు