priyanka gandhi: రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి బాజాలు

గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా వివాహం తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చయమైంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు.

New Update
FotoJet (63)

priyanka gandhi son marrige

Priyanka Gandhi: గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా వివాహం తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చయమైంది. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్‌ వాద్రాకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు. అందులో రేహాన్‌, ఆయన పెళ్లి చేసుకోబోయే అవీవా బేగ్‌ల ఫోటోలను షేర్‌ చేశారు. వారిద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులని తెలిపారు. అంతేకాక వారి చిన్నప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు. 

Also Read: ఐరన్‌ డాన్‌ వర్సెస్‌ గ్రానైట్‌ కింగ్... 20 ఏళ్లుగా..వాల్మీకి సాక్షిగా..

Priyanka Gandhi Son Marriage

మరోవైపు రేహాన్‌ తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న రెహాన్-అవీవా బేగ్ ఇటీవల రాజస్థాన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రెహాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అందులో అవీవాబేగ్‌తో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటో కూడా ఉంది. రాజస్థాన్‌ రణతంబోర్‌లో అత్యంత సన్నిహిత కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రేహాన్‌ గతవారం పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. దానికి ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లోనే వీరి వివాహం కూడా జరగనున్నట్లు సమాచారం. 

Also Read: ఎందుకింత రిస్క్ రాజాసాబ్..? అందరి దృష్టి ఇప్పుడు దానిపైనే..!

కాగా తాజాగా తండ్రి రాబర్ట్ వాద్రా ఈ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఈ విషయాన్ని రాబర్ట్ వాద్రా స్వయంగా ధ్రువీకరిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. రాబర్ట్ వాద్రా ఎమోషనల్ పోస్ట్: "నా కుమారుడికి తన జీవిత భాగస్వామి దొరికింది. రెహాన్ తన జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారిద్దరి బంధం ఎల్లప్పుడూ అన్యోన్యంగా, ప్రేమతో సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ జంట సంతోషంగా వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని రాబర్ట్ వాద్రా రాసుకొచ్చారు. కాగా రేహాన్‌ వాద్రా విజువల్‌ ఆర్టిస్ట్. వైల్డ్‌లైఫ్‌, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అవీవా కూడా ఫొటోగ్రాఫర్‌. ఓ ఫొటోగ్రఫిక్ స్టూడియో, ప్రొడక్షన్‌ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు.

Also Read: వామ్మో.. 'రాజాసాబ్' ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే?

కాగా రేహాన్, అవీవా డిసెంబర్ 29న రాజస్థాన్‌లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో  ఉంగరాలు మార్చుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల వారు పచ్చజెండా ఊపడంతో ఈ వేడుక ఘనంగా జరిగింది.రెహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ను ఎంచుకున్నాడు. ఢిల్లీ, డెహ్రాడూన్, లండన్లలో విద్యాభ్యాసం పూర్తి చేసిన రెహాన్.. 'డార్క్ పర్సెప్షన్' పేరుతో సోలో ఎగ్జిబిషన్‌ను కూడా నిర్వహించారు. నేచర్ ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. అవీవా బేగ్ కూడా కళారంగానికి చెందిన వ్యక్తి. ఆమె ఒక ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్, ప్రొడ్యూసర్. ఆమె 'అటెలియర్ 11' (Atelier 11) అనే ఫోటోగ్రాఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి కో-ఫౌండర్. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్రాండ్‌లు, ఏజెన్సీలతో ఆమె కంపెనీ కలిసి పనిచేస్తోంది. 

Advertisment
తాజా కథనాలు