/rtv/media/media_files/2026/01/03/raja-saab-premieres-2026-01-03-09-06-34.jpg)
Raja Saab Premieres
Raja Saab Premieres: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుండడం విశేషం.
సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన బుకింగ్స్ చూస్తే అనుకున్న స్థాయిలో లేవని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయినా రిలీజ్ దగ్గర పడే సరికి పరిస్థితి మారే అవకాశం ఉందని, మాస్ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ప్రభాస్ సినిమా అంటే ఓపెనింగ్స్ బలంగా ఉంటాయనే నమ్మకం మేకర్స్‌లో ఉంది.
ఇక సినిమాకు ఒక రోజు ముందే అంటే జనవరి 8న స్పెషల్ ప్రీమియర్స్ వేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేసారు మేకర్స్. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ షోలకు టికెట్ ధర రూ.800 వరకు ఉండే అవకాశం ఉందట. ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
Velthunara premieres ki....!
— NEWS3PEOPLE (@news3people) January 2, 2026
[ news3people, the Raja Saab, prabhas, maruthi, premieres ] pic.twitter.com/ap0Bh7BUeL
ఇటీవలి కాలంలో స్పెషల్ షోలకి ఎక్కువ టికెట్ రేట్స్ పెట్టిన సినిమాలకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ‘పుష్ప 2’ లాంటి భారీ సినిమా కూడా మొదట ఎక్కువ రేట్స్ వద్ద పూర్తి హౌస్‌లు పడలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే తర్వాత కొన్ని సినిమాలు టికెట్ ధరలను తగ్గించుకున్నాయి. ఇప్పుడు ‘ది రాజా సాబ్’కి రూ.800 రేటు పెట్టడం వల్ల, ఆడియన్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకులు ఈ రేటుకు థియేటర్లకు వస్తే రికార్డు ఓపెనింగ్స్ ఖాయం. లేకపోతే మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.
జనవరి 8 సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రీమియర్స్‌కి, టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. జనవరి 8 సాయంత్రం నుంచే అక్కడ ప్రీమియర్ షోలు మొదలయ్యే ఛాన్స్ ఉంది. కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల కారణంగా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలు, ప్రీమియర్స్‌కు అనుమతి ఇవ్వడం లేదు. అందువల్ల హైదరాబాద్ సహా తెలంగాణలో ‘ది రాజా సాబ్’కి ప్రీమియర్ షోలు పడతాయా లేదా అనే సందేహాలు ఉన్నాయి.
మొత్తానికి ‘ది రాజా సాబ్’ సినిమా భారీ బజ్‌తో బరిలోకి దిగుతోంది. టికెట్ ధరలు, ప్రీమియర్స్, ఆడియన్స్ రెస్పాన్స్ అన్నీ కలిసి ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Follow Us