/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t124553884-2025-12-05-12-46-27.jpg)
Rasagulla fight at wedding reception
Rasagulla fight : పెళ్లంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి, నిబద్ధతకు ప్రతీక. రెండు జీవితాలు ఒక్కటిగా నూతన జీవితాన్ని ఆవిష్కరించే సందర్భం. ఈ సందర్బంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహాజం. అలాంట పుడు రెండు కుటుంబాలు సంయమనం పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ చాలామంది చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగి పచ్చని పెళ్లి పందిరి యుద్ధ క్షేత్రంగా మారుస్తున్నారు. జీవితాంతం కలిసి జీవించాలను కున్న జంటకు ఈ ఘటన చెరిగిపోని మచ్చగా మిగిలిపోతుంది. తాజాగా ఓ పెళ్లి విందులో ఎదురైన ఘటన ఒక రకంగా రెండు కుటుంబాలను ఇబ్బందికి గురి చేయగా, ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధంతమా అంటూ మరికొంతమంది నవ్వుకునేలా చేసింది.
#Watch
— Priyanka Koul (@Priyankakaul13) December 3, 2025
Chaos After 'Rasgulla Shortage' At Bihar Wedding pic.twitter.com/Rks41zJtnq
వివరాల్లోకి వెళితే ఒక పెళ్లిలో ఏర్పాటు చేసిన విందులో అతిథులకు రసగుల్ల వడ్డించారు. అయితే అవి.. కొందరికే అందాయి. మిగతా అతిథులకు విందులో రసగుల్లా దొరకలేదు. అంతే.. పెళ్లికి వచ్చిన అతిథులు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ విచిత్ర ఘటన బీహార్ ములోని బోద్‌గయాలో చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు పొట్టుపొట్టుగా కొట్టుకున్న దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు తెగ నవ్వేసు కుంటున్నారు.
బీహార్‌లోని బోధ్ గయలో ఓ హోటల్‌లో వివాహ వేడుక ఏర్పాటు చేశారు. వధూవరుల కుటుంబాలు అదే హోటల్‌లో బస చేశారు. అయితే అప్పటి వరకూ ఎంతో అప్యాయంగా పలకరించుకుంటూ ఉన్న అతిథులు ఒక్కసారిగా బద్ధ శత్రువులుగా మారిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అందుకు కారణం పెళ్లి విందులో వడ్డించిన రసగుల్లా. విందులో ఏర్పాటు చేసిన రసగుల్లా స్వీట్లు అయిపోవడంతో వధువు, వరుడి తరపు కుటుంబాలు ఘర్షణ పడి చితక్కొట్టుకున్నారు. కుర్చీలు విసిరేసుకుంటూ. ఒకరి నొకరు తోసుకుంటూ.. కొట్టుకున్నారు.
ఈ వివాదం మొత్తం అక్కడి హోటల్ సీసీటీవీలో రికార్డైంది. అదికాస్తా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయింది. ఈ సంఘటన నవంబర్ 29న చోటు చేసుకుంది. ఈ గొడవతో పెళ్లి ఆగిపోయింది. చివరికి ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వధువు కుటుంబం వరుడి కుటుంబంపై వరకట్న కేసు నమోదు చేసింది. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాగా ఈ సంఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు.
Follow Us