/rtv/media/media_files/2025/07/27/raj-thackeray-enters-matoshree-2025-07-27-21-15-45.jpg)
మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే 13 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి ముంబైలోని మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులైన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు బాల్ ఠాక్రే చిత్రం ముందు నిలబడి ఫొటో దిగారు. నా అన్నయ్య శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా, దివంగత గౌరవనీయ బాలాసాహెబ్ ఠాక్రే నివాసం మాతోశ్రీని సందర్శించా. నా శుభాకాంక్షలు తెలియజేశానని రాజ్ ఠాక్రే Xలో పేర్కొన్నారు. ఎంఎస్‌ఎస్ నేతలు బాలా నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్ కూడా రాజ్ ఠాక్రే వెంట ఉన్నారు.
माझे मोठे बंधू, शिवसेना पक्षप्रमुख श्री. उद्धव ठाकरे यांच्या वाढदिवसानिमित्त त्यांना मातोश्री या
— Raj Thackeray (@RajThackeray) July 27, 2025
कै. माननीय श्री.बाळासाहेब ठाकरे यांच्या निवासस्थानी जाऊन शुभेच्छा दिल्या... pic.twitter.com/sFp2Hduubx
రాజకీయ విభేదాల కారణంగా 2006లో మాతోశ్రీని రాజ్ ఠాక్రే వీడారు. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) పార్టీని ఏర్పాటు చేశారు. 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించినప్పుడు చివరిసారి మాతోశ్రీకి ఆయన వచ్చారు. 13 ఏళ్ల తర్వాత తొలిసారి మాతోశ్రీని ఆయన సందర్శించారు.
After 13 years, Raj Thackeray enters Matoshree,
— Social News Daily (@SocialNewsDail2) July 27, 2025
to celebrate cousin and Shiv Sena (UBT) chief Uddhav Thackeray's birthday.
Raj Thackeray was accompanied by MNS leaders Bala Nandgaonkar and Nitin Sardesai.
In 2012, Raj Thackeray had last entered Matoshree, at the time of… pic.twitter.com/ymdvDha5j9
మహారాష్ట్రలోని ప్రాథమిక స్కూళ్లలో హిందీ భాష తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వివాదానికి దారి తీసింది. ఈక్రమంలో మరాఠీ గుర్తింపు పోరాటంలో భాగంగా ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు 2 దశాబ్దాల తర్వాత తొలిసారి ఒకే రాజకీయ వేదికపైకి వచ్చారు. వర్లిలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో కలిసి ప్రసంగించారు.
maharashtra | sivasena | sivasena-leader | uddav-thakrey | latest-telugu-news