/rtv/media/media_files/2025/08/19/limited-luggage-2025-08-19-12-19-02.jpg)
భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సాధారణంగా విమాన ప్రయాణాల్లో లగేజీ బరువుపై కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు అదే తరహాలో రైల్వేల్లో కూడా లగేజీ పరిమితులను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశించిన ఉచిత పరిమితి కంటే ఎక్కువ సామాను తీసుకువెళ్లే ప్రయాణికులు, స్టేషన్‌లోని లగేజీ కార్యాలయంలో ముందుగానే బుక్ చేసుకోవాలని, లేనిపక్షంలో భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు.
ఏ క్లాస్‌లో ఎంత లగేజీకి అనుమతి?
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులు ప్రయాణించే బోగీని బట్టి ఫ్రీ లగేజీ పరిమితులు ఉన్నాయి
ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. (గరిష్టంగా 150 కిలోలు ఛార్జీతో).
ఏసీ 2-టైర్: 50 కిలోల వరకు ఉచితం. (గరిష్టంగా 100 కిలోలు).
ఏసీ 3-టైర్ / చైర్ కార్: 40 కిలోల వరకు ఉచితం. (గరిష్టంగా 40 కిలోలే అనుమతి).
స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు ఉచితంగా అనుమతిస్తారు. (గరిష్టంగా 80 కిలోలు).
సెకండ్ క్లాస్ (జనరల్): 35 కిలోల వరకు ఉచితం. (గరిష్టంగా 70 కిలోలు).
🚨Passengers need to pay for extra Luggage on Trains: Railway Minister
— Indian Infra Report (@Indianinfoguide) December 17, 2025
Free Luggage carrying limit per passenger-
•AC First Class- 70Kg
•AC 2 Tier - 50Kg
•AC 3 Tier or Chair Car- 40Kg
•Sleeper- 40Kg
•Second class- 35Kg
ముందుగా బుక్ చేసుకోకపోతే 6 రెట్లు జరిమానా!
ప్రయాణికులు తమ వద్ద ఉన్న అదనపు సామానును ప్రయాణానికి ముందే లగేజీ కౌంటర్‌లో బుక్ చేసుకోవాలి. అలా కాకుండా రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టీటీఈ (TTE) తనిఖీలో అదనపు లగేజీ పట్టుబడితే, సాధారణ ఛార్జీల కంటే 6 రెట్లు ఎక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, భారీ సామాను వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ పాత నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీని తూకం వేసే ఎలక్ట్రానిక్ యంత్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
Follow Us