High Court: షుగర్ పేషెంట్‌కు దివ్యాంగుల పెన్షన్...హైకోర్టు  తీర్పు

ఆర్మీలో చేరిన ఓ వ్యక్తి.. డయాబెటిస్‌ కారణాలతో బయటకు వచ్చేశాడు. అయితే, తన ఆరోగ్య కారణాల రీత్యా దివ్యాంగుల కేటగిరీగా పరిగణించి తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరగా...కేంద్రం ఒప్పుకోకపోయిన కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.

New Update
court

High Court: సైన్యంలో ఉండగా ఓ సైనికుడు డయాబెటిక్‌ బాధితుడిగా మారితే అతనికి దివ్యాంగుల పెన్షన్‌ను తిరస్కరించలేరని పంజాబ్‌ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది.  ఈ మేరకు ఓ మాజీ సైనికుడి విషయంలో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించలేదు. షుగర్ బాధితుడిగా మారిన మాజీ సైనికుడికి దివ్యాంగుల పెన్షన్ వర్తింపజేయాల్సిందేనని తేల్చిచెప్పింది.

Also Read:  కార్తీక మాసం స్పెషల్‌ ఆఫర్‌...కేవలం 650 రూపాయలకే..!

కేసు వివరాల్లోకి వెళ్తే.. ఓ మాజీ సైనికుడు 2003 జనవరిలో ఆర్మీలో చేరారు. అయితే, తీవ్రమైన మానసిక ఒత్తిడితో టైప్-2 డయాబెటిస్ బాధితుడిగా మారిన ఆయన అభ్యర్థన మేరకు 2019 అక్టోబరు 31న సర్వీసు నుంచి ఆయనను తప్పించారు. సైన్యం నుంచి బయటకొచ్చిన సమయంలో అతనికి డయాబెటిస్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో దానిని ఆయనకు వైకల్యంగా పరిగణించి దివ్యాంగుల పెన్షన్‌ను వర్తింపజేస్తారు. 

Also Read:  మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తనకు ఈ తరహా పెన్షన్ వర్తింజేయాలని సదరు మాజీ సైనికుడు అభ్యర్ధించగా.. నవంబర్ 4, 2019న దీనిని ఆర్మీ అధికారులు తిరస్కరించారు. ఆయనకు అది వారసత్వంగా సంక్రమించిందని వాదించారు. దీనిని ఆయన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్‌లో సవాల్ చేయగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది.

Also Read: అదరగొట్టిన ఐక్యూ.. ప్రాసెసర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది భయ్యా!

కేంద్రం సవాల్...

దీంతో పంజాబ్ హరియాణా హైకోర్టులో కేంద్రం సవాల్ చేసింది. ఆయన ఎటువంటి ఒత్తిడి లేని ప్రదేశంలో విధులు నిర్వర్తించారని, జీవనశైలితో పాటు వంశపారంపర్యంగా డయాబెటిక్ వచ్చిందని వాదించింది. అయితే, ఎన్‌లిస్ట్‌మెంట్ సమయంలో జన్యుపరంగా సక్రమిస్తుందా? అలా వచ్చే అవకాశం ఉందా? అనే దాని గురించి ఒక నివేదికను సమర్పించాలని  తెలిపింది. అయితే ఈ కేసులో అది చేయలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్, జస్టిస్ సుదీప్తి శర్మల ధర్మాసనం వివరించింది.

Also Read:  బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్‌.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక

 టైప్ II డయాబెటిస్‌కు అనారోగ్యానికి కారణమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపమే కారణమని ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ, సైనికుడిగా ఉన్న సమయంలోనే  తీవ్రమైన ఒత్తిడి కారణంగానే బాధితుడు డయాబెటిస్ బారినపడ్డాడని, 50 శాతం వైకల్యం ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయని కోర్టు పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు