APS RTC: కార్తీక మాసం స్పెషల్‌ ఆఫర్‌...కేవలం 650 రూపాయలకే..!

కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ భక్తుల కోసం ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. చిన్న పిల్లలు రూ. 400, పెద్దలు రూ. 650 లతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిని చూసేయోచ్చు. అయితే ఈ ఆఫర్‌ కేవలం కర్నూలులోని భక్తులకు మాత్రమే.

New Update
kurnool

APS RTC: రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస సందడి నెలకొంది. దేవాలయాలు అన్ని కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ మాసం లో రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకునేందుఉ భక్తులు ఆసక్తి చూపుతుంటారు. కార్తీక మాసంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఎక్కువగా తరలి వెళ్తుంటారు. 

Also Read:  ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ

కర్నూలు ఆర్టీసీ డిపో... 

కార్తీక మాసం సందర్భంగా ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది కేవలం కర్నూలు కు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కర్నూలు ఆర్టీసీ డిపో అధికారులు భక్తుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా పంచ శైవ క్షేత్ర దర్శనీ పేరుతో కర్నూలు ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేక టూర్ ప్యాకేజీని మొదలు పెట్టారు. ఈ టూర్‌లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను దర్శించవచ్చు.

Also Read:  బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్‌.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక

పంచ శైవక్షేత్ర దర్శని యాత్రలో భాగంగా యాగంటి, మహానంది, ఓంకారం, భోగేశ్వరం, కాల్వబుగ్గ పుణ్యక్షేత్రాలకు కర్నూలు ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఈ ప్రత్యేక టూర్ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 4, 11, 18, 25వ తేదీల్లో ఈ టూర్ అందుబాటులో కి రానున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read:  హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు

ఉదయం ఆరు గంటలకు కర్నూలులో ప్రారంభమై.. రాత్రికల్లా తిరిగి కర్నూలు చేరుకుంటారు. ఆల్ట్రా డీలక్స్ బస్సులను ఇందుకోసం ఏర్పాటు చేయగా.. పిల్లలకు రూ.400, పెద్దలకు రూ.650లను టికెట్ ధరలుగా అధికారులు నిర్ణయించారు.

Also Read:  జగన్ సంచలనం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరు బాట!

టీజీఆర్టీసీ గుడ్‌ న్యూస్‌

కార్తీక మాసం సందర్భంగా తెలంగాణలోని భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్‌ చెప్పింది. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రాల‌కు భ‌క్తుల కోసం ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్టతో పాటు పలు దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్టు చెప్పారు.

ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల యాత్రలు, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం, త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి  వ‌ర్చువ‌ల్‌గా ఉన్నత‌స్థాయి స‌మీక్షా స‌మావేశాన్ని స‌జ్జనార్ నిర్వహించారు.

ఆర్టీసీకి కార్తీక మాసం, శ‌బ‌రిమ‌ల యాత్రలు  ఎంతో ముఖ్యమని ఇలాంటి సందర్భంలో  భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు సజ్జనార్‌  సూచించారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉంటుంది.  అందుకు అనుగుణంగా అధికారులు ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని సూచించారు.

ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని అరుణాచ‌లానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని ప్రకటించారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాల‌కు ప్రతి సోమ‌వారం ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బ‌స్సుల్లో  http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవాల‌న్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు