iQOO 13: అదరగొట్టిన ఐక్యూ.. ప్రాసెసర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది భయ్యా!

iQOO 13 ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. అందులో ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఇది Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో రానుంది. ఇది Qualcommలో శక్తివంతమైన చిప్‌సెట్‌గా చెప్పబడుతుంది.

New Update
iQOO 13

ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇప్పటికే ఎన్నో ఫోన్లను లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు మరో ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలే iQOO 13 ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు ఆ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అయింది.

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

iQOO 13

ఈ ఫోన్ త్వరలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. దీని కోసం కంపెనీ ఒక టీజర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే అమెజాన్‌ కూడా IQOO ఫోన్‌ను లిస్టింగ్‌లో ఉంచింది. దీంతో ఈ ఫోన్‌లోని కొన్ని స్పెసిఫికేషన్స్ బయటకొచ్చాయి. అంతేకాకుండా ఈ ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్ డిజైన్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. అందులో ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఇది Snapdragon 8 Elite చిప్‌సెట్ రానున్నట్లు ఫోన్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఇది Qualcommలో అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్‌గా చెప్పబడుతుంది. ఈ చిప్‌సెట్ Antutuలో టాప్ స్కోర్ చేసిన OnePlus 13లో కూడా ఇవ్వబడింది. దీని బట్టి చూస్తే iQOO 13 కూడా OnePlus 13కి గట్టి పోటీని ఇవ్వబోతోందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఫోన్ స్పెసిఫికేషన్లపై కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది.

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

కంపెనీ ఇటీవల చైనాలో iQOO 13ని పరిచయం చేసింది. ఈ ఫోన్ 6.82 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 2K కంటే ఎక్కువ రిజల్యూషన్‌ను అందించింది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అదే సమయంలో ఈ ఫోన్ 4500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది.

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! 

ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో భారతదేశంలో ప్రారంభించబోతోంది. అంతేకాకుండా ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6,150mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఫోన్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు